పూజా హెగ్డే చేతిలో మరో బంపర్ ఆఫర్.. ఇది అయినా నిలబెట్టుకుంటుందా.?

Anil Kumar

08 June 2024

పూజా హెగ్డే.. అసలు ఈ ముద్దుగుమ్మ తెలియని వాళ్ళు అంటూ ఉంటారా.? ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ తెలుసు..

కొన్ని నెలల వరకు ఏ భాషలోనైనా వరస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ వయ్యారిభామ ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది.

ఒక లైల కోసం సినిమా తో మొదలైన ఈమె ప్రయాణం.. అలా వైకుంఠ పురంలో వరకు ఓ స్పీడ్ లో దూసుకుపోయింది పూజా హెగ్డే.

చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా తర్వాత తెలుగులో పూజా హెగ్డేకు కోరుకున్న అవకాశాలు రావట్లేదు.

ఆ మధ్య ఎప్పుడో నాగ చైతన్య, కార్తిక్ దండు సినిమాలో ఆఫర్ అందుకున్నారు ఈ బ్యూటీ. కానీ ఆ మూవీపై అప్డేట్ లేదు.

ఇదిలా ఉంటె తాజాగా ఈ బుట్టబొమ్మ పూజాకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.. అదేంటి అంటారా..?

హీరో సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ కాంబోలో రాబోయే సినిమాలో పూజా హెగ్డేనే హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ప్రచారం.

దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యినట్టే అని టాక్. వేచి చూడాలి ఎం అవుతుందో.