అనుకోని వివాదంలో రష్మిక.. ఎక్కడ నుండి ఎక్కడకి వెళ్తుందో..

Anil Kumar

20 May 2024

రష్మిక మందన్న సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. నెట్టింట మాత్రం ఏదోక టాపిక్ మీద ట్రేండింగ్ లో ఉంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీట్ ఒకటి.. దేశ రాజకీయ నాయకులను సైతం టచ్ చేసింది అనే టాక్ వినిపిస్తుంది.

కొద్దిరోజుల క్రితం అటల్ సేతు బ్రిడ్జ్‌ను పొగుడుతూ రష్మిక పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు దుమారం రేపుతుంది.

22 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 20 నిమిషాల్లోనే రీచ్ అయ్యాను అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసింది.

ఇది ఇక్కడితో ఆగలేదు.. హీరోయిన్ రష్మిక ట్వీట్ కి ప్రధాని మోదీ రిప్లై ఇవ్వడంతో విషయం మరింత పెద్దదైంది.

హఠాత్తుగా మోదీ సర్కార్‌పై ప్రశంసలెందుకో అంటూ రష్మికను టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు.

పలు పార్టీలు రకరకాలుగా స్పందించగా.. కాంగ్రెస్ అయితే ఓ అడుగు ముందుకేసి ఐటి రైడ్స్ నుంచి తప్పించుకోడానికి..

మోదీని కాకా పడుతుందంటూ రష్మికపై ఆరోపణలు చేస్తున్నారు పలువురు నాయకులు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.