Breaking News
  • శ్రీకాకుళం: కచరాంలో తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం నిర్వాకం. రోడ్లపై గుర్రపు స్వారీ నిర్వహించిన తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం. బైక్‌పై వెళ్తున్న రాంబాబు, రమాదేవి దంపతులను గుద్దిన గుర్రం. ఆస్పత్రిలో రాంబాబు పరిస్థితి విషమం. పట్టించుకోని రిసార్ట్‌ యాజమాన్యం. రాసార్ట్‌ ఎదుట స్థానికుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం. భారీగా మోహరించిన పోలీసులు.
  • ప.గో: తణుకు మండలం దువ్వలో పిచ్చికుక్క స్వైర విహారం. పిచ్చికుక్క దాడిలో10 మందికి గాయాలు.
  • గుంటూరు: సత్తెనపల్లిలో మహిళ ఆత్మహత్యాయత్నం. చోరీ కేసు పెట్టారన్న మనస్థాపంతో నిద్రమాత్రలు మింగిన లక్ష్మీ. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కదిరి మండలం నడిమిపల్లిలో దారుణం. యువకుడు సుధాకర్‌ గొంతు కోసిన దుండగులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్‌. గతంలో రామాంజనేయులు భార్యను ఎత్తుకెళ్లి.. తిరిగి అప్పగించిన సుధాకర్‌. రామాంజనేయులుపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.
  • అనంతపురం: హిందూపురంలో రెచ్చిపోయిన వీధికుక్కలు. ఇద్దరు చిన్నారులపై దాడి. వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారులు. ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి విషమం.
  • విజయవాడ: వంశీ వ్యాఖ్యలపై అయ్యప్ప భక్త కమిటీ అభ్యంతరం. టీవీ9 డిబేట్‌లో వంశీ అనుచిత వ్యాఖ్యలు సరికాదు. అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. పరుష పదజాలంతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అయ్యప్ప భక్తులకు వంశీ కళంకం తెచ్చారు. ఇప్పటికైనా నియమనిష్టలతో దీక్ష చేయాలి-వేణుగోపాలస్వామి.
  • హైదరాబాద్‌: అశ్వత్థామరెడ్డి నివాసానికి వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి. అశ్వత్థామరెడ్డిని పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అందరూ ముందుకు రావాలి. అశ్వత్థామరెడ్డికి ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. కార్మికుల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి. సడక్‌బంద్‌ను విజయవంతం చేయాలి-ఎంపీ కోమటిరెడ్డి.

సైరా నరసింహా రెడ్డి: ఫ్యాన్స్ రచ్చరంబోలా.. పోలీసులకు తలనొప్పి..!

జై చిరంజీవా.. జై సైరా.. జై సైరా నరసింహా రెడ్డి అంటూ.. చిరు ఫ్యాన్స్.. థియేటర్స్ వద్ద ఫుల్‌గా హంగామా చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ ఉదయాన్నే థియేటర్స్ వద్దకు చేరుకొని ఫుల్‌గా జోరు షురూ చేశారు. పాలాభిషేకాలు.. పూలమాలలు, పెద్ద పెద్ద కటౌట్‌లతో.. మెగాస్టార్‌ని పూజిస్తున్నారు. సైరా ఫీవర్‌తో హడలెత్తిస్తున్నారు చిరు ఫ్యాన్స్. వాళ్ల ఆనందాలకు హద్దే లేకుండా పోయింది. ఇంద్ర, ఠాగూర్ సినిమాలకు ఎలా జనాలు నీరాజనాలు పట్టారో.. ఇప్పుడు అదే విధంగా.. చిరంజీవి ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు హోరెత్తిస్తున్నారు.

కాగా.. ఇప్పటికే సైరా సినిమా.. మంచి టాక్‌తో దూసుకెళ్లిపోతోంది. అటు.. మెగా మేనళ్లుడు.. సాయి ధరమ్ తేజ్ కూడా.. ట్వీట్టర్‌ ట్వీట్ చేసి.. పార్టీ.. పార్టీ అంటూ.. హల్‌చల్ చేస్తున్నారు. గద్దలకొండ గణేష్ అలియాస్ వరుణ్‌ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానంటూ.. ఇదివరకే చెప్పాడు. అలాగే.. ఇప్పటికే ఏపీలో ఆరు షోలకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా.. సైరా సినిమా విడుదల అయింది. ఇప్పటికే.. సినిమా సూపర్‌ అంటూ.. కొందరు ప్రముఖులు ట్వీట్ పెడుతున్నారు. ఇటు చిరంజీవికి కూడా.. ఈ పాత్ర తన జీవిత కల అని పలుమార్లు చెప్పుకొచ్చారు కూడా. కాగా.. ఫ్యాన్స్ హంగామాతో.. ఇటు పోలీసులకు చిక్కుగా మారింది. థియేటర్స్ వద్ద ఎటువంటి.. అల్లర్లు జరగకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.