బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి ‘నందిగ్రామ్’ కార్యాలయంపై దాడి, బీజేపీ, టీఎం సీ పరస్పర ఆరోపణలు

బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సువెందు అధికారి కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి  చేశారు.

బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి 'నందిగ్రామ్' కార్యాలయంపై దాడి, బీజేపీ, టీఎం సీ పరస్పర ఆరోపణలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 10, 2021 | 3:55 PM

Suvendu Adhikari’s Nandigram: బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సువెందు అధికారి కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి  చేశారు. నందిగ్రామ్ లోని ఈ ఆఫీసు ఫర్నిచర్ ను వారు ధ్వంసం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని కోరిన  బీజేపీ-కండబలం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. అధికారంలో ఉన్నాం కదా అని ఇలా మా నేత  కార్యాలయంపై దాడులు చేస్తే సహించబోమని, ప్రతీకారం తీర్చుకుంటామని ఈ పార్టీ నేత కనిష్క పాండా అన్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ దీనిపై స్పందిస్తూ.. మీ పార్టీకి ఒకప్పుడు చెందిన కార్యకర్తలే ఈ విధ్వంసానికి దిగారని ఇది మా పని కాదని ప్రత్యారోపణ చేశారు. మీ పాత బీజేపీ కార్యకర్తలే ఇందుకు బాధ్యులని పేర్కొంది. బెంగాల్ లో మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా సువెందు అధికారి నందిగ్రామ్ కార్యాలయంపై దాడి  జరగడం విశేషం.

Also Read:

Bike Accident: స్తంభాన్ని ఢీకొన్న ద్విచక్రవాహనం.. మైనర్ బాలుడు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

వైభవంగా కొమురవెల్లి మల్లన్న కళ్యాణ మ‌హోత్స‌వం.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు

రాజకీయ లబ్దికోసం ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు, దివిస్ పై పవన్ కళ్యాణ్ అప్పుడెందుకు స్పందించలేదన్న మంత్రి