Paris Olympics 2024: క్రీడాకారుల అంకితభవానికి దేశం సెల్యూట్ చేస్తోంది: కేంద్ర మంత్రి సింధియా

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్‌ చేయలేకపోయాయి. కాగా రెండో క్వార్టర్‌ ఆరంభంలో స్పెయిన్‌ ఆటగాడు మార్క్‌ మిరల్లెస్‌ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మార్చాడు. దీంతో స్పెయిన్‌ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక 29వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలిచేందుకు ప్రయత్నించినా స్పెయిన్‌ గోల్‌కీపర్‌ అడ్డుకున్నాడు...

Paris Olympics 2024: క్రీడాకారుల అంకితభవానికి దేశం సెల్యూట్ చేస్తోంది: కేంద్ర మంత్రి సింధియా
Paris Olympics 2024
Follow us

|

Updated on: Aug 08, 2024 | 9:38 PM

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు సత్తా చాటింది. కాంస్య పతకాన్ని దక్కిచుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 2-1తో స్పెయిన్‌పై గెలుపొందింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్ అద్భుత ఆటతీరును కనబరించారు. రెండు గోల్స్‌చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 2024 ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్‌ చేయలేకపోయాయి. కాగా రెండో క్వార్టర్‌ ఆరంభంలో స్పెయిన్‌ ఆటగాడు మార్క్‌ మిరల్లెస్‌ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మార్చాడు. దీంతో స్పెయిన్‌ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక 29వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలిచేందుకు ప్రయత్నించినా స్పెయిన్‌ గోల్‌కీపర్‌ అడ్డుకున్నాడు.

వెంటనే మరో పెనాల్టీ కార్నర్‌ లభించగా భారత్‌ సద్వినియోగం చేసుకుంది. ఈ సారి హర్మన్‌ప్రీత్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతి గోల్‌ పోస్ట్‌లోకి పంపి స్కోరును 1-1తో సమం చేశాడు.60వ నిమిషంలో ప్రత్యర్థికి మరో పెనాల్టీ కార్నర్‌ రాగా.. సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఒలింపిక్స్‌లో భారత్ 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు కాంస్య పతకాలు దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీరకు ముగింపు పలికిన శ్రీజేశ్‌ భారత్ గెలిచిన అనంతరం ఉద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో గోల్‌ పోస్టు ఎక్కి సంబరాలు చేసుకున్నాడు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ సింగ్ అతడిని తన భుజాలపై ఎత్తుకుని మైదానమంతా కలియ తిరిగాడు. ఇతర ఆటగాళ్లు కూడా శ్రీజేశ్‌ను అభినందించారు.

ఇదిలా ఉంటే భారత్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత హాకీ జట్టును ప్రశంసిస్తూ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్‌ చేశారు. భారత హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, క్రీడాకారుల అంకితభావానికి, కృషికి, నిబద్ధతకు దేశం సెల్యూట్ చేస్తుంది అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ థ్రిల్లింగ్ మూవీ..
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ థ్రిల్లింగ్ మూవీ..
క్రీడాకారుల అంకితభవానికి దేశం సెల్యూట్ చేస్తోంది: కేంద్ర మంత్రి
క్రీడాకారుల అంకితభవానికి దేశం సెల్యూట్ చేస్తోంది: కేంద్ర మంత్రి
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
వార్నీ తాగుబోతు చేష్టలు..!తప్పతాగి పట్టాలపై పడుకున్నాడు..ఏమైందంటే
వార్నీ తాగుబోతు చేష్టలు..!తప్పతాగి పట్టాలపై పడుకున్నాడు..ఏమైందంటే
ఐక్యూ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ బడ్జెట్‌లోనే సూపర్
ఐక్యూ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ బడ్జెట్‌లోనే సూపర్
స్టైలిష్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న విక్రమ్.. వావ్ అంటూ కామెంట్స్.
స్టైలిష్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న విక్రమ్.. వావ్ అంటూ కామెంట్స్.
కేరళ సీఎంను కలిసిన చిరంజీవి.. కోటి రూపాయల చెక్కు అందజేత
కేరళ సీఎంను కలిసిన చిరంజీవి.. కోటి రూపాయల చెక్కు అందజేత
సమ్మర్‌ రిబ్బన్‌కట్టింగ్‌కి నేను రెడీ అంటున్న రౌడీ హీరో విజయ్‌..
సమ్మర్‌ రిబ్బన్‌కట్టింగ్‌కి నేను రెడీ అంటున్న రౌడీ హీరో విజయ్‌..
పెళ్లి తర్వాత వరుడి ముఖం చూసిన వధువు.. తొలి చూపులోనే మూర్చపోయింది
పెళ్లి తర్వాత వరుడి ముఖం చూసిన వధువు.. తొలి చూపులోనే మూర్చపోయింది
రూ. ఆరు వేలలో అదిరిపోయే ఫోన్‌.. ఫీచర్స్‌ కూడా సూపర్‌..
రూ. ఆరు వేలలో అదిరిపోయే ఫోన్‌.. ఫీచర్స్‌ కూడా సూపర్‌..
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!
ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఒకటి కాదు., ఏకంగా రెండు..
ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. ఒకటి కాదు., ఏకంగా రెండు..
స్టేజ్‌పైనే సుమను ముద్దుపెట్టుకున్న హాలీవుడ్ యాక్టర్.. సుమ తెలివి
స్టేజ్‌పైనే సుమను ముద్దుపెట్టుకున్న హాలీవుడ్ యాక్టర్.. సుమ తెలివి
స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయ్యింది.. పవన్ కామెంట్స్ వైరల్
స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయ్యింది.. పవన్ కామెంట్స్ వైరల్
పేరుకి ముంబై ముద్దుగుమ్మలే.. కానీ చూపంతా టాలీవుడ్ పైనే..
పేరుకి ముంబై ముద్దుగుమ్మలే.. కానీ చూపంతా టాలీవుడ్ పైనే..