Watch: పెళ్లి తర్వాత వరుడి ముఖం చూసిన వధువు.. తొలి చూపులోనే మూర్చపోయింది..!
వరుడి ముఖం చూసిన వధువు ఒక్కసారిగా మూర్ఛపోయింది..ఇదే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. యువతికి వరుడి ముఖం చూపించకుండానే కుటుంబసభ్యులంతా కలిసి చాలా సింపుల్‌గా పెళ్లిని జరిపించేశారు. ఇలా పెళ్లయిన తర్వాత ఆ అమ్మాయికి వరుడి ముఖం చూపించారు. ఇక అప్పుడు వధువు తన భర్త ముఖాన్ని చూసిన తొలి చూపులోనే సొమ్మసిల్లిపడిపోయింది.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పెళ్లి చేసుకునే అబ్బాయికి అమ్మాయికి మధ్య 10-12 ఏళ్ల గ్యాప్ ఉండటం సర్వసాధారణం. ఏజ్ గ్యాప్ ఎక్కువైతే ఆ పెళ్లికి ఓకే అంటున్నారు అమ్మాయిలు. అయితే, కొందరు అమ్మాయిలు తమ కుటుంబీకుల ఒత్తిడికి తలొగ్గి తనకంటే 30-40 ఏళ్లు పెద్దవాడిని, తమకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా జరిగాయి. అలాగే తొలిసారిగా పెళ్లి మండపంలో వృద్ధుడైన వరుడిని చూసిన ఒక వధువు పెళ్లి రద్దు చేసుకున్న వార్త వైరల్‌గా మారింది. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతి 69 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ, మొదటిసారి వరుడి ముఖం చూసిన ఆ వధువు స్పృహతప్పి పడిపోయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
దీనికి సంబంధించి ఒక పోస్ట్ Incognito_qfs పేరుతో X ఖాతాలో షేర్ చేయబడింది. 20 ఏళ్ల ముస్లిం వధువు 69 ఏళ్ల వరుడి ముఖం చూసి మూర్ఛపోయింది అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. వరుడి ముఖం చూసిన వధువు ఒక్కసారిగా మూర్ఛపోయింది..ఇదే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. యువతికి వరుడి ముఖం చూపించకుండానే కుటుంబసభ్యులంతా కలిసి చాలా సింపుల్‌గా పెళ్లిని జరిపించేశారు. ఇలా పెళ్లయిన తర్వాత ఆ అమ్మాయికి వరుడి ముఖం చూపించారు. ఇక అప్పుడు వధువు తన భర్త ముఖాన్ని చూసిన తొలి చూపులోనే సొమ్మసిల్లిపడిపోయింది.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
20 year old Muslim bride faints after her seeing face of her 69 year old husband. pic.twitter.com/KwDpGsWFsM
— Incognito (@Incognito_qfs) August 6, 2024
ఆగస్ట్ 7న షేర్ చేయబడిన ఈ వీడియో 2 మిలియన్లకు పైగా వ్యూస్‌తో వైరల్‌గా మారింది. వరుడి ముఖం చూడకుండా అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు అంగీకరించావంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..