రాత్రికి రాత్రే వినేశ్‌ ఫొగాట్‌ బరువు ఎలా పెరిగింది? 

08 August 2024

TV9 Telugu

TV9 Telugu

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో ఫైనల్‌ చేరిన వినేశ్‌ ఫొగాట్‌.. కల లాంటి ప్రయాణానికి కలలో కూడా ఊహించని ముగింపు ఎదురైంది. భారత్‌ ఆశలు కూలాయి. కోట్ల హృదయాలు కలుక్కుమన్నాయి

TV9 Telugu

50 కేజీల మహిళ రెజ్లింగ్‌ విభాగంలో ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నట్లు ఒలింపిక్‌ కమిటీ గుర్తించడంతో ఆమె ఫైనల్‌ ఆడకుండా అనర్హత వేటు విధించింది

TV9 Telugu

అయితే బరువు తగ్గేందుకు వినేష్ ఫొగాట్ పడిన కష్టం అభిమానులను మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రౌండ్‌ 16, క్వారర్స్‌, సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు ముందు వినేష్‌ ఫొగాట్‌ బరువు 50 కిలోల కంటే తక్కువే ఉంది

TV9 Telugu

కానీ, ఫైనల్‌ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు మాత్రం ఉన్నట్లుండి అంత ఎలా పెరిగిందనేది ప్రతి ఒక్కరి సందేహం. రాత్రికి రాత్రి ఇలా బరువు పెరగడమేంటి? అని ప్రతి ఒక్కరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

TV9 Telugu

ఇందుకు గల కారణాలు ఒలింపిక్స్‌లో భారత ప్రధాన వైద్యాధికారి దిన్షా పర్దీవాలా చెబుతూ.. వినేశ్‌ డీహైడ్రేషన్‌ బారిన పడకుండా స్వల్ప మొత్తంలో నీరు తీసుకుంది. శక్తి కోసం 1.5 కేజీల ఆహారం తీసుకుంది. సెమీస్‌ తర్వాత ఆమె బరువు పెరిగిందని గమనించాం

TV9 Telugu

మంగళవారం రాత్రి జరిగిన సెమీఫైనల్ తర్వాత ఆమె బరువు 52.7 కిలోలు.  అప్పటి నుండి నీరు, ఆహారం తీసుకోకుండా కోచ్‌ సారథ్యంలో బరువు తగ్గే ప్రక్రియను వినేశ్‌ మొదలెట్టింది. రాత్రంతా బరువు తగ్గేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించింది

TV9 Telugu

ఉదయానికల్లా ఆమె బరువును 50.1 కిలోలకు తగ్గింది. కానీ మిగిలిన 100 గ్రాములు తగ్గించడానికి సమయం మిగల్లేదు. కానీ కొన్నిసార్లు పోటీలు పూర్తయ్యాక తిరిగి బరువు పెరుగుతూనే ఉంటారు. చివరకు పోటీలు పడే అవకాశం లేకపోగా.. వినేశ్‌ నీరసంగా కనిపించడంతో ముందస్తు జాగ్రత్తగా ఆమెను ఆసుపత్రికి తరలించామన్నారు

TV9 Telugu

ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన వినేశ్‌ ఫొగాట్‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడటం క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే గుండె పగిలిన వినేశ్‌.. ఈరోజు రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించింది