TV9 Football Talent Hunt: యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం టీవీ 9.. ఎస్ఎఫ్‌ఏతో కీలక ఒప్పందం..

|

Oct 18, 2024 | 6:16 PM

దేశంలోని యువ క్రీడాకారులను వెలికి తీయడానికి టీవీ 9 నెట్ వర్క్ నడుం బిగించింది. ముఖ్యంగా ఫుట్ బాల్ లో మెరికల్లాంటి యువకులకు శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగేందుకు తన వంతు కృషి చేస్తోంది. ఇందుకోసం పలు క్రీడా సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.

TV9 Football Talent Hunt: యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం టీవీ 9.. ఎస్ఎఫ్‌ఏతో కీలక ఒప్పందం..
TV9 Network Joins with SFA for News9 Indian Tigers and Tigresses For Football Initiatives
Follow us on

దేశంలోని యువ ఫుట్ బాల్ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు TV9 నెట్‌వర్క్‌ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA)తో కలిసి TV9 నెట్‌వర్క్ ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్‌స్ పలు కార్యక్రమాలు, పోటీలను నిర్వహిస్తోంది. ఈ ట్యాలెంట్ హంట్ లో భాగంగా News9 ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్‌లు దేశవ్యాప్తంగా 12 -17 సంవత్సరాల వయస్సు గల బాలురు, బాలికలను గుర్తించి శిక్షణ ఇవ్వనున్నాయి. భారతదేశంలో ఫుట్ బాల్ క్రీడకు మరింత ప్రాముఖ్యం చేసేందుకు యూరప్‌లోని DFB పోకల్, బుండెస్లిగా, ఇండియా ఫుట్‌బాల్ సెంటర్, IFI, BVB, RIESPO తదితర సంస్థలతో టీవీ9 నెట్ వర్క్ జత కట్టింది. ప్రతిభావంతులైన యువకులకు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇప్పించడం, చిన్న వయసు నుండే ప్రపంచ స్థాయి ఆటగాళ్లుగా శిక్షణ ఇవ్వడం ఈ ట్యాలెంట్ హంట్ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం అక్టోబర్ 28 వరకు హైదరాబాద్‌లో జరుగుతున్న SFA ఛాంపియన్‌షిప్‌లో, యువ ఫుట్‌బాల్ క్రీడాకారులు అందుబాటులో ఉన్న కియోస్క్‌లో ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్’ టాలెంట్ హంట్‌లో నమోదు చేసుకోవచ్చు. News9 ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ క్యాంపెయిన్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని యువకులకు సువర్ణావకాశాన్ని అందిస్తూ, దేశంలోనే అతిపెద్దదైన SFA ఛాంపియన్‌షిప్‌లలో నగరంలోని దాదాపు 400 పాఠశాలల నుండి 23000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.

SFA చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ దర్పణ్ కుమార్ మాట్లాడుతూ: “హైదరాబాద్‌లో జరిగే SFA ఛాంపియన్‌షిప్‌లో TV9 నెట్‌వర్క్ ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్’తో చేతులు కలిపినందుకు మేం సంతోషిస్తున్నాము. ఈ సహకారం యువ క్రీడాకారులను మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. భారతదేశం అంతటా అట్టడుగు స్థాయి క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడం, తరువాతి తరం క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం మా మిషన్‌ను మరింత బలపరుస్తుంది.

భారతదేశంలో అట్టడుగు స్థాయిన ఉన్న యువ క్రీడాకారులను వెలికి తీయడంలో SFA ఛాంపియన్‌షిప్‌లు కీలక పాత్ర పోషించనున్నాయి. దేశంలో బలమైన క్రీడా సంస్కృతిని నిర్మించడం, క్రీడా పోటీల్లో పాల్గొనేలా యువతను ప్రేరేపించడం దీని ప్రధాన లక్ష్‌యం. 2024-25 ఛాంపియన్‌షిప్‌లు భారతదేశంలోని 10 నగరాల్లో జరుగుతాయి, ఇందులో 7000 పాఠశాలల నుండి 150,000 మంది విద్యార్థులు 31 క్రీడాంశాల్లో తలపడనున్నారు. ఛాంపియన్‌షిప్‌లలో 25 క్రీడలతో పాటు అన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లు SAF వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..