శభాస్ షూటర్స్..​ ప్రపంచకప్​లో భారత్​కు మూడో స్వర్ణం

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్​లో యశస్విని సింగ్​(భారత్​), ఒలింపిక్ విన్నర్ ఒలేనా కోస్టెవిచ్‌(ఉక్రెయిన్​)ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. 22 ఏళ్ల ఈ అమ్మాయి 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్​ విభాగంలో 236.7 పాయింట్ల స్కోరుతో విజేతగా నిలిచింది. ఈ విజయంతో షూటింగ్​లో టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది యశస్విని.  ఈ టోర్నీలో మాజీ ఒలింపిక్ విజేత, ప్రపంచ నెం.1 షూటర్​ కోస్టెవిచ్ 234.8 పాయింట్లతో రజతం అందుకోగా.. జాస్మినా మిలోవనోవిక్(సెర్బియా) తర్వాత స్థానంలో నిలిచింది.ఇప్పటికే షూటింగ్​లో […]

శభాస్ షూటర్స్..​ ప్రపంచకప్​లో భారత్​కు మూడో స్వర్ణం
Earlier in the day Kajal Saini of India delivered a hugely improved performance in the women's 50m Rifle 3 Positions (3P) by finishing 22nd with a qualifying round score of 1167

Updated on: Sep 01, 2019 | 5:50 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్​లో యశస్విని సింగ్​(భారత్​), ఒలింపిక్ విన్నర్ ఒలేనా కోస్టెవిచ్‌(ఉక్రెయిన్​)ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. 22 ఏళ్ల ఈ అమ్మాయి 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్​ విభాగంలో 236.7 పాయింట్ల స్కోరుతో విజేతగా నిలిచింది. ఈ విజయంతో షూటింగ్​లో టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది యశస్విని.  ఈ టోర్నీలో మాజీ ఒలింపిక్ విజేత, ప్రపంచ నెం.1 షూటర్​ కోస్టెవిచ్ 234.8 పాయింట్లతో రజతం అందుకోగా.. జాస్మినా మిలోవనోవిక్(సెర్బియా) తర్వాత స్థానంలో నిలిచింది.ఇప్పటికే షూటింగ్​లో అభిషేక్​ వర్మ, ఎలెవెనిల్ వలరివన్​ స్వర్ణాలు సాధించారు. ఇప్పటి వరకు 2020 టోక్యో ఒలింపిక్స్​​కు యశస్విని, సంజీవ్ రాజ్‌పుత్, అంజుమ్ మౌద్గిల్, అపూర్వి చందేలా, సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ, దివ్యాన్ష్ సింగ్ పన్వర్, రాహి సర్నోబాట్, మను బాకర్​ అర్హత సాధించారు.