
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. క్రికెటర్లు, ఇతర అథ్లెట్లు ఏదైనా ఘనతలు సాధిస్తే.. వారికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలుపుతారు. వీటితో పాటు సచిన్ అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ వీడియోలు పోస్ట్ చేసి.. అభిమానులను ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇదే మాదిరి సచిన్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. దాని ద్వారా అభిమానులను ఓ క్లిష్ట ప్రశ్న అడిగారు. ఇక ఆ వీడియో విషయానికి వస్తే.. ఓ క్రికెట్ మ్యాచ్‌లో బౌలర్ వేసిన బంతి వికెట్లకు తగులుతుంది కానీ బెయిల్ కింద పడకుండా.. వికెట్‌పై ఆగుతుంది. దీంతో అంతా షాక్ అవుతారు. అంపైర్ వచ్చి బెయిల్‌ని సరిగ్గా పెట్టి నిర్ణయం ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో బౌలర్ నిరాశ చెందుతాడు.