సైనా వెళ్లిపోవడం బాధ కలిగించింది..ఆమె నా ప్రియ శిష్యురాలు

|

Jan 14, 2020 | 4:15 PM

ఎందరో మెరికల్లాంటి బాట్మింటన్ స్టార్స్‌ని తయారు చేసిన ఘనత ఆయన సొంతం. ప్రపంచ వ్యాప్తంతా ప్రస్తుతం సత్తా చాటుతోన్న భారత ఆటగాళ్లంతా ఆయన శిష్యరికంలో ఓనమాలు నేర్చుకున్నవారే. ఆతనెవరో కాదు..ఇండియన్ బాట్మింటన్ ఏస్ కోచ్ పుల్లెల గోపిచంద్. గెలిచిన వెంటనే నెక్ట్స్ టార్గెట్‌‌పై దృష్టి పెట్టమనే మనస్తత్వం గోపిచంద్‌ది. ఓటమే తనపై ఎక్కువ భాద్యత పెంచుతుందనే చెప్పే కోచ్ అతడు. ఫేమస్ జర్నలిస్ట్ బోరియా మజుందార్‌ ‘డ్రీమ్స్ ఆఫ్‌ ఎ బిలియన్‌: ఇండియా అండ్‌ ద ఒలింపిక్‌ […]

సైనా వెళ్లిపోవడం బాధ కలిగించింది..ఆమె నా ప్రియ శిష్యురాలు
Follow us on

ఎందరో మెరికల్లాంటి బాట్మింటన్ స్టార్స్‌ని తయారు చేసిన ఘనత ఆయన సొంతం. ప్రపంచ వ్యాప్తంతా ప్రస్తుతం సత్తా చాటుతోన్న భారత ఆటగాళ్లంతా ఆయన శిష్యరికంలో ఓనమాలు నేర్చుకున్నవారే. ఆతనెవరో కాదు..ఇండియన్ బాట్మింటన్ ఏస్ కోచ్ పుల్లెల గోపిచంద్. గెలిచిన వెంటనే నెక్ట్స్ టార్గెట్‌‌పై దృష్టి పెట్టమనే మనస్తత్వం గోపిచంద్‌ది. ఓటమే తనపై ఎక్కువ భాద్యత పెంచుతుందనే చెప్పే కోచ్ అతడు. ఫేమస్ జర్నలిస్ట్ బోరియా మజుందార్‌ ‘డ్రీమ్స్ ఆఫ్‌ ఎ బిలియన్‌: ఇండియా అండ్‌ ద ఒలింపిక్‌ గేమ్స్‌’ అనే పుస్తకం రాస్తోన్న విషయం తెలిసిందే. అందులో సైనా నెహ్వాల్‌తో తనుకున్న విభేదాలపై స్పందించారు గోపిచంద్. తన అకాడమీ నుంచి సైనా వెళ్లిపోవడం ఇష్టం లేదని, ఆమె వెళ్తోన్న సమయంలో ప్రియ శిష్యురాలు తననుంచి దూరమవుతోన్న ఫీలింగ్ కలిగిందని చెప్పారు. వెళ్లొద్దని ఎంతో ప్రాదేయపడ్డానని, అప్పటికే ఆమె వేరే వాళ్ల మాటలు చెవికెక్కించుకుందని పేర్కొన్నారు. 2012 -2014 మధ్య కాలంలో పీవీ సింధు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న దశలో కూడా సైనాకు సమ ప్రాధాన్యతను ఇచ్చానని గోపిచంద్ తెలిపారు. యువ క్రీడాకారులను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, బాధగా ఉన్నా సైనాని వెళ్లకుండా ఆపలేకపోయానని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు టీమిండియా చీఫ్ బ్యాట్మింటన్ కోచ్.

ఇక బాట్మింటన్ దిగ్గజం  ప్రకాశ్‌ పదుకొనేపై కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు పుల్లెల గోపిచంద్. ‘బాట్మింటన్‌కు ఎంతగానో సేవ చేస్తున్నా..ఆయన్ను(ప్రకాశ్‌ పదుకొనే)ను చాలా అభిమానిస్తా. అయినా కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రశంసించలేదు. ఇదెప్పటికి అంతుచిక్కని మిస్టరీనే’ అంటూ మనసులోని ఆవేదనను సదరు బుక్‌లోని  ‘బిట్టర్‌ రైవలరీ’ అనే అధ్యాయంలో చెప్పుకొచ్చారు గోపిచంద్.