Qatar: ఫుట్‌బాల్‌ టీమ్‌కు హై సెక్యూరిటీ.. ఏకంగా F-16 యుద్ధ విమానాలతో భద్రత.. అంతే కాకుండా..

|

Nov 19, 2022 | 8:58 AM

ఫిఫా వరల్డ్ కప్‌కు ఖతార్ రెడీ అయింది. రేపు (ఆదివారం) నుంచి డిసెంబర్ 18 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందుకోసం అన్ని దేశాల జట్లు ఖతార్‌కు చేరుకుంటున్నాయి. ఐతే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో పోలెండ్‌ టీమ్‌ భారీ..

Qatar: ఫుట్‌బాల్‌ టీమ్‌కు హై సెక్యూరిటీ.. ఏకంగా F-16 యుద్ధ విమానాలతో భద్రత.. అంతే కాకుండా..
Fifa World Cup Securtiy
Follow us on

ఫిఫా వరల్డ్ కప్‌  నకు ఖతార్ రెడీ అయింది. రేపు (ఆదివారం) నుంచి డిసెంబర్ 18 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందుకోసం అన్ని దేశాల జట్లు ఖతార్‌కు చేరుకుంటున్నాయి. ఐతే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో పోలెండ్‌ టీమ్‌ భారీ భద్రత మధ్య ఖతార్‌కు చేరుకుంది. ఇటీవల పోలెండ్‌ సరిహద్దులోని ఓ గ్రామంపై మిస్సైల్స్‌ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఐతే రష్యా-ఉక్రెయిన్‌లకు బార్డర్‌ దేశంగా ఉన్న పోలండ్‌ జట్టు.. ఫిఫా వరల్డ్‌ కప్‌ జరగనున్న ఖతార్‌కు వెళ్లాలంటే ఈ రెండు దేశాల ఎయిర్‌బేస్‌ను దాటుకొని వెళ్లాలి. దీంతో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన చెందిన పోలండ్ ప్రభుత్వం.. రక్షణ దళాలను రంగంలోకి దింపింది. ఈ జట్టుకు రెండు F-16 విమానాలు ఎస్కార్ట్‌గా వచ్చాయి. జట్టుకు రక్షణగా దోహా ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరిన విమానం వెంట..F-16 ఫైటర్‌ జెట్లు వెళ్లాయి. రెండు జెట్స్‌ పోలండ్ ఆటగాళ్ల విమానానికి భద్రతగా వచ్చి ఖతార్‌లో దింపి వెనక్కి వెళ్లిపోయాయి.

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది పోలెండ్‌ టీమ్‌. ప్రపంచకప్‌లో గ్రూప్-సీ లో ఉన్న పోలండ్.. మంగళవారం తమ తొలి పోరులో మెక్సికోతో తలపడుతుంది. ఆ తర్వాత నవంబరు 26న సౌదీ అరేబియాతో రెండో మ్యాచులో ఆడనుంది. ఇక చివరి గ్రూప్ మ్యాచ్‌లో అర్జెంటీనాను ఢీకొంటుంది. అయితే.. ఫిఫా వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఒక జట్టు ఎస్కార్ట్‌తో రావడం ఇదే తొలిసారి అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తు్న్నారు.

మరోవైపు..మద్యం విక్రయం, వినియోగంపై ఖతార్ ప్రభుత్వం నిషేధం విధించింది. మెగా పుట్ బాల్ టోర్నమెంట్ మ్యాచ్ లు జరిగే 8 స్టేడియాల్లో పరిసర ప్రాంతాల్లో బీర్ అమ్మకాలు, తాగడం నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఫిఫా ఓ ప్రకటనలో తెలిపింది. ఖతార్ అనేది ఓ ఇస్లామిక్ దేశం. అక్కడ సహజంగానే మద్యం అమ్మకాలను అంగీకరించరు. ఈ బీర్ నిషేధం వల్ల మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందనే వాదనలు ఉన్నాయి. అయితే ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణ యోచన, ఒప్పందాల సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి