ధోని రికార్డు బ్రేక్ చేసిన పంత్..!

|

Mar 25, 2019 | 4:56 PM

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డు ను యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అధిగమించాడు. అయితే ఇది ఇంటర్నేషనల్ రికార్డు కాదులేండి.. ఐపీఎల్ రికార్డు. ఆదివారం ముంబైతో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ తో చెలరేగిన విషయం తెలిసిందే. ముంబై బౌలర్లను ఊచకోత చేస్తూ 18 బంతులలోనే 50 పరుగులు చేశాడు. దీనితో గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని చేసిన వేగవంతమైన హాఫ్ […]

ధోని రికార్డు బ్రేక్ చేసిన పంత్..!
Follow us on

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డు ను యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అధిగమించాడు. అయితే ఇది ఇంటర్నేషనల్ రికార్డు కాదులేండి.. ఐపీఎల్ రికార్డు. ఆదివారం ముంబైతో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ తో చెలరేగిన విషయం తెలిసిందే. ముంబై బౌలర్లను ఊచకోత చేస్తూ 18 బంతులలోనే 50 పరుగులు చేశాడు. దీనితో గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని చేసిన వేగవంతమైన హాఫ్ సెంచరీ(20 బంతుల్లో)ను పంత్ అధిగమించాడు.  ధోని 2012 సీజన్ లో ఈ ఫీట్ ముంబై ఇండియన్స్ పై సాధించాడు.

అయితే ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కింగ్స్ ఎలెవెన్ ఆటగాడు కెఎల్ రాహుల్ నమోదు చేశాడు. గత సీజన్ లో రాహుల్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇక 15 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన లిస్ట్ లో సునీల్ నరైన్, యూసుఫ్ పఠాన్ లు సంయుక్తంగా రెండవ స్థానం దక్కించుకున్నాడు.