బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో భారత షట్లర్‌కు చుక్కెదురు.. నిరాశే మిగిల్చిన పీవీ సింధు

|

Jan 27, 2021 | 7:41 PM

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధుకు నిరాశే మిగిలింది. గ్రూప్‌-బిలో మహిళల సింగిల్స్‌లో.. ప్రపంచ నంబర్‌వన్ షట్లర్‌‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో తలపడింది.

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో భారత షట్లర్‌కు చుక్కెదురు.. నిరాశే మిగిల్చిన పీవీ సింధు
Follow us on

PV Sindhu Loses : బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధుకు నిరాశే మిగిలింది. గ్రూప్‌-బిలో మహిళల సింగిల్స్‌లో.. ప్రపంచ నంబర్‌వన్ షట్లర్‌‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో తలపడింది. అయితే ఇందులో తొలి సెట్‌లో దూకుడు ప్రదర్శించిన సింధు 21-19తో నెగ్గింది. ఆ తర్వాత జరిగిన రెండు సెట్‌లలొ గట్టి పోటీ ఇచ్చినా.. ఓటమి చవి చూసింది. 21-19, 12-21, 17-21 తేడాతో పరాజయం పాలైంది.

ఇక నిర్ణయాత్మక గేమ్‌ ఉత్కంఠగా సాగింది. ఆదిలో తైజు 6-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా సింధు గొప్పగా పోరాడి 6-6తో స్కోరు సమం చేసింది. కానీ కొన్ని పొరపాట్లతో సింధు మరోసారి ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది. దీంతో 17-21తో మ్యాచ్‌ నుంచి వెనుదిరిగింది. 59 నిమిషాల పాటు ఈ మ్యాచ్ ఉత్కంఠగా ‌ సాగింది.

ఇప్పటివరకు తై జు యింగ్‌తో సింధు 21 మ్యాచ్‌ల్లో తలపడగా 16 సార్లు ఓటమిపాలైంది. కాగా, సింధు తన తర్వాతి మ్యాచ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఇంతానన్‌ రచనోక్‌తో తలపడనుంది. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో సాగే ఈ టోర్నీలో.. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులు సెమీస్‌కు అర్హత సాధిస్తారు.