Winter Olympics 2022: చైనాకు మరో షాక్.. వింటర్ ఒలింపిక్స్‌ బహిష్కరణ దిశగా మరో రెండు దేశాలు..!

|

Dec 09, 2021 | 2:02 PM

China: వింటర్ ఒలింపిక్స్ 2022 వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో జరగనున్నాయి. అయితే ఈ ఆటలు ప్రారంభానికి ముందే పలు దేశాలు బహిస్కరించే దిశగా అడుగులు వేస్తున్నాయి.

Winter Olympics 2022: చైనాకు మరో షాక్.. వింటర్ ఒలింపిక్స్‌ బహిష్కరణ దిశగా మరో రెండు దేశాలు..!
Winter Olympics 2022
Follow us on

Winter Olympics 2022: వింటర్ ఒలింపిక్స్ 2022 వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో జరగనుంది. ప్రారంభానికి ముందే, ఈ గేమ్‌లు వివాదాలతో చుట్టుముట్టినట్లు కనిపిస్తున్నాయి. ఈ గేమ్‌ల కోసం చాలా దేశాలు తమ అధికారులను చైనాకు పంపకూడదని నిర్ణయించుకున్నాయి. ఇప్పుడు దీనికి రెండు కొత్త దేశాల పేర్లు కూడా చేరాయి. గ్రేట్ బ్రిటన్, కెనడా కూడా తమ అధికారులను వింటర్ ఒలింపిక్స్‌కు పంపకూడదని నిర్ణయించుకున్నాయి. వచ్చే ఏడాది చైనాలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌కు దౌత్యపరమైన బహిష్కరణ ఉంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ బుధవారం తెలిపారు. దీనికి తన మంత్రులు లేదా అధికారులు ఎవరూ హాజరు కాకూడదని భావిస్తున్నారు.

ఆ తర్వాత కెనడా కూడా ఇదే ప్రకటన చేసింది. అయితే వీటన్నింటి వెనుక ఓ కారణం ఉంది. మానవ హక్కుల సమస్యకు సంబంధించి ఈ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాలు కూడా ఈ నిర్ణయం తీసుకున్నాయి. మానవ హక్కుల ఆందోళనల కారణంగా బీజింగ్ వింటర్ గేమ్స్‌ను దౌత్యపరమైన బహిష్కరణకు తమ దేశం యూఎస్‌కు మద్దతు ఇస్తుందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ తెలిపారు. బీబీసీ కథనం ప్రకారం.. చైనా మాత్రం అమెరికా నిర్ణయాన్ని ఖండించింది.

జాన్సన్ ఇలా అన్నాడు..
పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లో జాన్సన్‌ను ఈ విషయమై అడిగినప్పుడు, ఏ దౌత్యవేత్త కూడా గేమ్స్‌కు వెళ్లరని పేర్కొన్నారు. “బీజింగ్‌లో జరిగే వింటర్ గేమ్స్‌పై సమర్థవంతమైన దౌత్యపరమైన బహిష్కరణ ఉంటుంది. వారి మంత్రులు లేదా అధికారులు ఎవరూ పాల్గొనరు” అని అతను తెలిపాడు. అతనికి ముందు, కన్జర్వేటివ్ నాయకుడు ఇయాన్ డంకన్ స్మిత్ కూడా ఈ విషయంపై మాట్లాడాడు.

కానీ జాన్సన్, “గేమ్స్‌ను బహిష్కరించడం తెలివైన పని అని నేను అనుకోను. ఇది ప్రభుత్వ విధానం కాదని” తెలిపాడు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విలేకరులతో మాట్లాడుతూ తమ దేశాన్ని బహిష్కరించడం చైనాకు ఆశ్చర్యం కలిగించదు. కెనడా, చైనా మధ్య సంబంధాలు 2018 నుంచి దెబ్బతిన్నాయి. అమెరికా అధికారుల సూచన మేరకు చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ హువావే ఉన్నతాధికారిని కెనడా అరెస్టు చేసింది. ఆ తర్వాత చైనా ఇద్దరు కెనడియన్లను అదుపులోకి తీసుకుంది. ఈ మూడూ ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదలయ్యారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై గత కొన్నేళ్లుగా తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఆయన అన్నారు.

ఆస్ట్రేలియా ప్రధాని ఏమన్నారంటే..
మరోవైపు ఇటీవలి సంవత్సరాలలో చైనాతో తమ దేశ సంబంధాలు సరిగా లేవని, అందువల్ల ఆస్ట్రేలియా అధికారులు వింటర్ ఒలింపిక్స్ వేడుకలను బహిష్కరించినా ఆశ్చర్యపోనక్కరలేదని మోరిసన్ అన్నారు. ఆస్ట్రేలియా జాతీయ ప్రయోజనాల కోసం నేను దీన్ని చేస్తున్నాను అని అతను తెలిపాడు. ఇది సరైన పని, అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ ఆటలలో పాల్గొంటారని’ మోరిసన్ తెలిపాడు.

అదే సమయంలో బీబీసీ వార్తల మేరకు.. జపాన్ కూడా ఈ ఆటలను దౌత్యపరమైన బహిష్కరణ అంశాన్ని పరిశీలిస్తోంది. అదే సమయంలో, న్యూజిలాండ్ తన అధికారులను బీజింగ్‌కు పంపబోమని స్పష్టం చేసింది. అయితే దీని వెనుక కారణం చైనా నుంచి ఉద్భవించిన కోవిడ్ మహమ్మారి మేరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చైనాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై న్యూజిలాండ్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: Team India: ద్రవిడ్ ఆట మొదలైంది.. కోహ్లీకి షాకిచ్చిన కొద్ది గంటలకే మరో సంచలనం.. వైస్ కెప్టెన్‌గా ఆయన పేరు సిద్ధం..!

Watch Video: ద్రవిడ్ కుమారుడు బ్యాట్స్‌మెన్ ఎందుకు కాలేదు? కోహ్లీ, ధోని ముఖంలో నవ్వులు పూయించిన కుంబ్లే సమాధానం..!