మనం చిన్నప్పుడు బెలూన్లతో సరదాగా ఎన్నో ఆటలాడి ఉంటాం. వాటిని గాలితో నింపి పైకి ఎగరేస్తూ కింద పడకుండా పందేలు కూడా వేసుకుని ఉంటాం. అయితే ఇప్పుడు ఆ సరదా ఆటే అంతర్జాతీయ క్రీడగా మారిపోయింది. బెలూన్లతో ఏకంగా ప్రపంచ కప్ పోటీలు నిర్వహించారు. స్పెయిన్ వేదికగా మొదటిసారిగా జరిగిన ఈ పోటీల్లో పెరూకు చెందిన ఫ్రాన్సెస్కో డి లా క్రూజ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.
My son and daughter play this and call it “keepy uppy”. They far more aggressive than these two and my living room is far more breakable than this setup.
— Jason Bounds (@chinacat4xx) October 18, 2021
కరోనా లాక్‌డౌన్‌లో బాగా పాపులర్ అయిన ఆటల్లో బెలూన్ గేమ్స్ కూడా ఒకటి. చాలామంది వీటిని కింద పడకుండా ఎగరేస్తూ ఉండే వీడియోలను తీసి టిక్ టాక్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉంచారు. ఇవి నెటిజన్లను తెగ ఆకట్టుకున్నాయి. బార్సిలోనాకు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు గెరార్డ్ పిక్…సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఇబయ్ లియానోస్ ఈ వీడియోలను చూసి అంతర్జాతీయ బెలూన్ల పోటీలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చారు. స్పెయిన్‌లోని తారాగోనా నగరంలోని ఓ స్టేడియంను బెలూన్ వరల్డ్ కప్ పోటీలకు వేదికగా ఎంచుకున్నారు.
the Balloon World Cup was last week
watch this space
— Dan Toomey ☕️ (@dhtoomey) October 17, 2021
పోటీల్లో భాగంగా 8×8 మీటర్ల కోర్టు ఏర్పాటు చేస్తారు. అందరి ఇళ్లల్లో ఉండే సోఫాలు, కుర్చీలు, టేబుళ్లు తదితర వస్తువులను అక్కడ ఉంచుతారు. ఇద్దరు పోటీ దారులను పిలిచి ఒక బెలూన్ వారికి అందజేస్తారు. ఒకరి తర్వాత ఒకరు దానిని కింద పడకుండా చేత్తో గాల్లోకి ఎగరేయాలి. బెలూన్ కోర్టులోని వస్తువులను తాకుకుండా, కింద పడకుండా జాగ్రత్తగా గేమ్ ఆడాలి. ఒకవేళ బెలూన్ కింద పడితే…ప్రత్యర్థి క్రీడాకారుడికి ఒక పాయింట్ ఇస్తారు. అలా నిర్ణీత సమయంలో ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తాయో వారే విజేతగా నిలుస్తారు.
32 దేశాల క్రీడాకారులు!
Ziggy is just waiting for the Dog Balloon World Cup pic.twitter.com/Jb6sOZqJ7G
— shitscaredmum ? (@shitscaredmum) October 18, 2021
అమెరికా, రష్యా, చైనా, స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రెజిల్, అర్జెంటీనా, పెరూ, బల్గేరియాతో సహా మొత్తం 32 దేశాల క్రీడాకారులు ఈ పోటీల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. మొత్తం ఐదు దశల్లో పోటీలు జరగ్గా జాన్ స్పైసెస్ (జర్మనీ), ఫ్రాన్సెస్కో డి లా క్రూజ్ (పెరూ) ఫైనల్స్‌కు చేరుకున్నారు. తాజాగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డి లా క్రూజ్ 6-2 తేడాతో జాన్‌పై విజయం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. బెలూన్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ గేమ్‌కి సంబంధించి తమ అనుభవాలను కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు.