Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించి, హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. నీరజ్ చోప్రా గత 13 సంవత్సరాలలో ఒలింపిక్స్‌లో భారత్ తరపున అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగాను నిలిచాడు. కాగా ఈ విజయంతో మనోడు భారత్‌లో ఓ స్టార్‌గా మారిపోయాడు. పలు ఆఫర్లతోపాటు నగదు బహుమతులు కూడా బాగానే అందుతున్నాయి మనోడికి. ఈ క్రమంలో ఓ పెద్ద కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయాడు.
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేసింది. దేశవ్యాప్తంగా వినియోగదారులకు అత్యుత్తమ ఆరోగ్య బీమా రక్షణకుతోడు, జీవిత బీమా, ఆరోగ్య పరిష్కారాలను అందించాలన్న కంపెనీ ఉద్దేశాలకు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా బాసటగా నిలుస్తారని ఓ ప్రకటనలో తెలిపింది. ఈమేరకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో టాటా ఏఐఏ కంపెనీ మరింతగా దూసుకపోతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత నీరజ్ చోప్రా తాజా పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 2 కి చేరుకున్నాడు. ఈ ర్యాంక్ 23 ఏళ్ల నీరజ్ చోప్రా కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్ అవ్వడం విశేషం. వేసవి క్రీడలకు ముందు భారత అథ్లెట్ ప్రపంచ ర్యాకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్నాడు.
T20 World Cup 2021: భావోద్వేగానికి గురైన ముంబై ప్లేయర్.. ఏడుస్తూ హార్దిక్‌కు హగ్ ఇచ్చిన ఇషాన్ కిషన్