PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా స్టార్ షట్లర్ పీవీ సింధు..!

|

Jun 26, 2021 | 12:53 PM

టోక్యో ఒలింపిక్స్‌లో భారత బృందాన్ని ముందుకు నడిపించే పతాకధారిగా తెలుగు తేజం పీవీ సింధుకి అవకాశం దక్కనుంది.

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా స్టార్ షట్లర్ పీవీ సింధు..!
Star Shuttler Pv Sindhu
Follow us on

Tokyo Olympics: రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ మెగా స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే టోక్యో క్రీడల్లో భారత జెండా చేత పట్టకుని నడిచే అవకాశం దక్కనుంది. ఈ మేరకు ఇద్దరిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహిళల నుంచి ఒకరు, పురుషుల నుంచి మరొకర్ని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మహిళల నుంచి పీవీ సింధును ఎన్నుకున్నట్లు భారత ఒలింపిక్ అధికారులు పేర్కొన్నారు. అయితే, అధికారిక ప్రకటన మాత్రం మరికొద్ది రోజుల్లో వెలువడనున్నట్లు తెలుస్తోంది.

పురుషుల్లో ఎవరనేది మాత్రం తేలలేదు. ముఖ్యంగా కొందరి పేర్లు మాత్రం బయటకు వస్తున్నాయి. వీటిలో బాక్సర్ అమిత్ పంఘాల్, రెజ్లర్ బజరంగ్ పూనియా, టీటీ ప్లేయర్ ఆచంట వరత్ కమల్, అథ్లెట్ నీరజ్ చోప్రా పేర్లు వినిపిస్తున్నాయి. కాగా, వీరిలో రియోలో ఏ పతకాన్ని సాధించలేదు. మరి ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాలంటే ఈ నెలాఖరవరకు ఆగాల్సిందే.

జూలై 23 నుంచి టోక్యో ఒలింపిక్స్ మొదలుకానున్న సంగతి తెలిసిందే. 2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజతం గెలిచింది. ఆ క్రీడల్లో తెలుగు తేజం కొద్దిలో స్వర్ణ పతకం చేజార్చుకుంది. రియో ఒలింపిక్స్ భారత్ నుంచి బ్యాండ్మింటన్‌లో పీవీ సింధు, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ పతకాలు గెలిచారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌కు రెజ్లర్ సాక్షి మాలిక్ అర్హత సాధించలేకపోవడంతో పీవి సింధుకు అవకాశం లభించనుంది. భారత్ నుంచి దాదాపు 100కు పైగా అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే సన్నాహకాలు పూర్తయినట్లు భారత ఒలింపిక్ అధికారులు ప్రకటించారు.

Also Read:

T20 World Cup: అక్టోబర్‌ 17 నుంచి యూఏఈలో పొట్టి ప్రపంచ కప్‌; నవంబర్‌ 14న ఫైనల్

ICC Tournaments: ఎంఎస్ ధోనీ నుంచి కేన్‌ విలియమ్సన్‌ వరకు.. 7 ఐసీసీ టోర్నీలలో 7 సార్లు కొత్త విజేతనే!

ENG vs SL: కాలితో రనౌట్ చేసిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్.. క్రికెట్‌లో ఫుట్‌బాల్‌ చూపించావంటూ నెటిజన్ల కామెంట్లు! వైరలవుతోన్న వీడియో