టీమిండియాకు షాక్‌ మీద మరో షాక్.. గెలిచినా కూడా.. ఇలా…

కివీస్‌తో జరిగిన 5 టీ20ల సీరస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసి.. రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ రికార్డులతో పాటుగా.. టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే.. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ గాయంతో వన్డే, టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. హిట్ మ్యాన్ మ్యాచ్‌లకు దూరమవుతన్నాడన్న చేదు వార్తతో ఉన్న టీమిండియాకు.. ఐసీసీ మరో చేదు వార్తను ఇచ్చింది. ఆదివారం జరిగిన చివరి ఐదో టీ-20 మ్యాచ్‌లో స్లోఓవర్‌ రేట్‌ […]

టీమిండియాకు షాక్‌ మీద మరో షాక్.. గెలిచినా కూడా.. ఇలా...

కివీస్‌తో జరిగిన 5 టీ20ల సీరస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసి.. రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ రికార్డులతో పాటుగా.. టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే.. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ గాయంతో వన్డే, టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. హిట్ మ్యాన్ మ్యాచ్‌లకు దూరమవుతన్నాడన్న చేదు వార్తతో ఉన్న టీమిండియాకు.. ఐసీసీ మరో చేదు వార్తను ఇచ్చింది. ఆదివారం జరిగిన చివరి ఐదో టీ-20 మ్యాచ్‌లో స్లోఓవర్‌ రేట్‌ కారణంగా.. టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

‘ఐసీసీ రూల్స్.. ఆర్టికల్ 2.22 ప్రకారం ప్రతి ఓవర్‌ నిర్ణీత సమయంలో పూర్తి కావాల్సి ఉంది. అలా జరగని పక్షంలో ఓవర్ ఆధారంగా మ్యాచ్‌ ఫీజులో కోత పడుతుంది. అది కూడా టీం సభ్యులందరిపై పడుతుంది. కాగా, ఆదివారం జరిగిన చివరి టీ20లో ఒక ఓవర్ ఆలస్యంగా వేయడం జరిగింది. దీనిపై ఫీల్డ్‌ అంపైర్లు క్రిస్‌ బ్రోన్‌, షాన్‌ హేగ్‌ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ పేర్కొంది.

ఇక దీనిపై టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా స్లోఓవర్‌ రేట్‌ను అంగీకరించాడని రిఫరీ పేర్కొన్నారు. దీంతో ఇక తదుపరి వాదనలు కూడా ఏం ఉండవన్నారు. ఇక నాలుగో వన్డేలో కూడా రెండు ఓవర్లు స్లో వేసిన కారణంగా.. 40శాతం కోత పడింది. వ్యక్తిగతంగా ఫీజులో కోత పడ్డా.. టీ20 సీరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. నయా రికార్డును మాత్రం సృష్టించింది.

Published On - 4:01 am, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu