Sanju Samson: ఫామ్‌లోకి వచ్చేసిన సంజూ శాంసన్.. ఫోర్లు, సిక్సర్లతో ఉతికారేసిన ఛెటా

Sanju Samson: రాంచీలో వెస్ట్ ఇండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత ఓపెనర్ సంజూ శామ్సన్ అదిరిపోయే ఇన్నింగ్స్‌తో మెరిసాడు. ప్రారంభంలో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు దాటేశాడు.

Sanju Samson: ఫామ్‌లోకి వచ్చేసిన సంజూ శాంసన్.. ఫోర్లు, సిక్సర్లతో ఉతికారేసిన ఛెటా
Sanju Samson

Updated on: Oct 09, 2026 | 7:36 PM

Sanju Samson:వెస్టిండీస్‌తో జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ సంజూ శామ్సన్ అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంజూ, ఈ రోజు రాంచీ మైదానంలో ఆరంభం నుంచే దూకుడుగ ప్రదర్శించాడు. మైదానంలో విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ తనలోని అసలైన హిట్టింగ్ పవర్‌ను చూపించాడు. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు దాటేశాడు.

ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో సంజూ శాంసన్ కు ఊహించని లైఫ్ లైన్ అందింది. అకీల్ హోసేన్ బౌలింగ్‌లో కవర్ దిశగా కొట్టిన సులువైన క్యాచ్‌ను విండీస్ ఫీల్డర్ కామిల్ పూరన్ చేజార్చాడు. ఆ తర్వాత వచ్చిన ఫ్రీ హిట్‌ను ఏకంగా సుదీర్ఘమైన సిక్సర్‌గా మలిచిన సంజూ, అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. విండీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దొరికిన ప్రతి బంతిని బౌండరీ దాటించే పనిలో పడ్డాడు.

మరోవైపు దూకుడుగా ప్రారంభించిన ఓపెనర్ అభిషేక్ శర్మ 12 బంతుల్లో 20 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్స్) చేసి రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఓపెనర్ వికెట్ పడినప్పటికీ సంజూ శామ్సన్ ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తన క్లాసిక్ షాట్లతో మైదానాన్ని నలుమూలలా అలరిస్తూ ఇన్నింగ్స్‌ను పటిష్టమైన స్థానంలో నిలిపాడు.

సంజూ శామ్సన్ మెరుపు బ్యాటింగుతో భారత జట్టు కేవలం 5వ ఓవర్ పూర్తికాకుండానే 50 పరుగుల మార్కును దాటేసింది. వికెట్ కీపర్ పొజిషన్ కోసం జరుగుతున్న పోటీలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఈ ఇన్నింగ్స్ ఎంతో కీలకంగా మారింది. భారీ స్కోరుపై కన్నేసిన టీమిండియాటాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగినప్పటికీ, సంజూ శామ్సన్ అందించిన వేగవంతమైన ఆరంభంతో భారత్ భారీ స్కోరు సాధించే దిశగా పయనిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను 2-0తో తమ వశం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us