వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు.. ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం!

వెయిట్‌లిఫ్టింగ్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగమ్మాయి బెల్లాన హారిక అద్భుత విజయం సాధించారు. విజయనగరం జిల్లా కొండవెలగాడ అనే చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు ఎదిగిన బెల్లాన హారిక ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. సమోవాలో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ జూనియర్ విభాగంలో ఆమె గోల్డ్ మెడల్ సాధించి విజయడంఖా మోగించింది.

వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు.. ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం!
Commonwealth Weightlifting Championship

Edited By:

Updated on: Apr 29, 2026 | 8:23 PM

పట్టుదల ఉంటే పేదరికం, నేపథ్యం అడ్డంకి కాదని మరోసారి నిరూపించింది విజయనగరం జిల్లా ఆణిముత్యం బెల్లాన హారిక. సమోవా వేదికగా జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో హారిక స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జాతి గర్వించేలా చేసింది. జూనియర్ విభాగంలో పోటీపడిన హారిక, ప్రారంభం నుంచే ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చింది. తన అద్భుత ప్రతిభతో స్నాచ్ విభాగంలో 86 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 111 కిలోలు ఎత్తి, మొత్తం 197 కిలోల బరువును విజయవంతంగా లిఫ్ట్ చేసింది. ఈ అద్భుత ప్రదర్శనతో ఇతర దేశాల క్రీడాకారిణులను వెనక్కి నెట్టి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

విజయనగరం జిల్లాలోని కొండవెలగాడ అనే మారుమూల గ్రామం హారిక స్వస్థలం. చిన్నతనం నుంచే క్రీడల పట్ల మక్కువ పెంచుకున్న హారిక, పల్లెటూరి వాతావరణంలోనే తన కలను నిజం చేసుకునేందుకు కృషి చేసింది. సరైన వసతులు లేకపోయినా, తనలోని పట్టుదలను మాత్రం వదలలేదు. ఆమెలోని ప్రతిభను గుర్తించిన కోచ్ వల్లూరి శ్రీనివాసరావు అందించిన శిక్షణ హారికను ప్రపంచ స్థాయి విజేతగా నిలబెట్టింది.

హారిక గోల్డ్ మెడల్ సాధించిందన్న వార్త తెలియగానే ఆమె స్వగ్రామంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యువతకు హారిక ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. సరైన మార్గదర్శకత్వం, నిరంతర సాధన ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆమె తన విజయం ద్వారా చాటి చెప్పింది.

ఇవి కూడా చదవండి

రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా అభిమానులు హారికను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాబోయే రోజుల్లో హారిక మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ముఖ్యంగా ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై భారత్ తరపున మెడల్స్ సాధించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. హ్యాట్సాఫ్ హారిక!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us