యూవీ మెరుగైన వీడ్కోలుకి అర్హుడు

|

Jun 11, 2019 | 7:54 PM

లండన్‌: టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ ఘన వీడ్కోలుకు అర్హుడని భారత ఓపెనర్‌, వైస్‌కెప్టెన్‌ రోహిత్‌శర్మ పేర్కొన్నాడు. యువీ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా రోహిత్‌ పై విధంగా ట్వీట్‌చేశాడు. ‘నీకు అందివచ్చింది ఏంటో అది కోల్పోయేదాకా నీకు తెలియదు. సోదరా.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తుంటా. ఘన వీడ్కోలుకు నువ్వు అర్హుడివి. నా మనసులో ఏమనుకుంటానో తెలుసా! నిన్ను అమితంగా ఇష్టపడుతుంటా. నువ్విక లెజెండ్‌గా ఎదగాలి’ అని ట్విటర్‌లో పోస్టు చేశాడు. […]

యూవీ మెరుగైన వీడ్కోలుకి అర్హుడు
Follow us on

లండన్‌: టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ ఘన వీడ్కోలుకు అర్హుడని భారత ఓపెనర్‌, వైస్‌కెప్టెన్‌ రోహిత్‌శర్మ పేర్కొన్నాడు. యువీ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా రోహిత్‌ పై విధంగా ట్వీట్‌చేశాడు. ‘నీకు అందివచ్చింది ఏంటో అది కోల్పోయేదాకా నీకు తెలియదు. సోదరా.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తుంటా. ఘన వీడ్కోలుకు నువ్వు అర్హుడివి. నా మనసులో ఏమనుకుంటానో తెలుసా! నిన్ను అమితంగా ఇష్టపడుతుంటా. నువ్విక లెజెండ్‌గా ఎదగాలి’ అని ట్విటర్‌లో పోస్టు చేశాడు.

ఇదిలా ఉండగా యువీ .. సమయమొచ్చినప్పుడు ఇంకా అనేక విషయాలు వెల్లడిస్తానని చెప్పాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌ జరుగుతున్నందున ఎలాంటి వివాదాలకు చోటివ్వదలచుకోలేదని, కచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని అన్నాడు. జీవితంలో ఇక ముందుకు వెళ్లేందుకే తాను రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నానని వివరించాడు.