
జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దీంతో పాటు ఈ ఛాంపియన్‌షిప్ ప్రైజ్ మనీని ప్రకటించిన ఐసీసీ ఈ ఎడిషన్ ప్రైజ్ మనీ కోసం దాదాపు రూ.29.75 కోట్లు కేటాయించింది.

ఇందులో 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న జట్టుకు 13.22 కోట్ల రూపాయలను బహుమతిగా అందజేయనున్నారు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 6.61 కోట్లు ప్రైజ్ మనీగా అందించనున్నారు.

ఈ రెండు జట్లతో పాటు స్టాండింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు రూ.3.71 కోట్లు అందుకోనుంది.

అలాగే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ జట్టు రూ.2.89 కోట్లు బహుమతిగా అందుకోనుంది.

5వ ర్యాంక్‌లో ఉన్న శ్రీలంక జట్టుకు 1.65 కోట్ల రివార్డ్ లభించనుంది.

ఆరో ర్యాంక్ న్యూజిలాండ్, ఏడో ర్యాంక్ పాకిస్థాన్, ఎనిమిదో ర్యాంక్ వెస్టిండీస్, తొమ్మిదో ర్యాంక్ బంగ్లాదేశ్ టీంలకు రూ.84 లక్షలు అందనున్నాయి.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం, కోచ్ రాహు ద్రవిడ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్‌లతో సహా సహాయక సిబ్బందితో కలిసి ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టారు.

ఐపీఎల్ 2023 ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో సహా మిగిలిన భారత క్రికెటర్లు ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు.