ఒరేయ్ ఆజామూ.. ఇలా తయారయ్యావేంట్రా.. 3 ఏళ్ల తర్వాత కెప్టెన్ గా రీఎంట్రీ ఇచ్చినా..

Babar Azam failed in WI vs PAK 1st Test: ప్రస్తుతం క్రీజులో షాన్ మసూద్‌తో పాటు కొత్తగా వచ్చిన ఆల్‌రౌండర్ సల్మాన్ అఘా ఉన్నాడు. మూడో రోజు ఆటలో వీరు ఏమేరకు రాణిస్తారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. పాకిస్థాన్ భారీ స్కోరు సాధించి ఆధిక్యం సంపాదిస్తుందో లేక విండీస్ బౌలర్లు కమ్ బ్యాక్ ఇచ్చి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంటారో వేచి చూడాలి.

ఒరేయ్ ఆజామూ.. ఇలా తయారయ్యావేంట్రా.. 3 ఏళ్ల తర్వాత కెప్టెన్ గా రీఎంట్రీ ఇచ్చినా..
Babar Azam Failed In Wi Vs Pak 1st Test

Updated on: Jul 28, 2026 | 8:52 PM

Babar Azam failed in WI vs PAK 1st Test: మూడేళ్ల తర్వాత మళ్లీ టెస్ట్ ఫార్మాట్‌లో పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దారుణంగా విఫలమై తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరి విమర్శల పాలవుతున్నాడు. అదే సమయంలో కెప్టెన్సీ కోల్పోయిన కసితో రగిలిపోతున్న మాజీ కెప్టెన్ షాన్ మసూద్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో కదం తొక్కుతున్నాడు.

కెప్టెన్సీ వచ్చినా ఫామ్ రాలేదు..

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయి. మొన్నటి వరకు టెస్ట్ జట్టుకు సారథ్యం వహించిన షాన్ మసూద్‌ను ఉన్నపళంగా తప్పించి మళ్లీ బాబర్ ఆజంకు పగ్గాలు అప్పగించారు. ఈ కీలక మార్పు తర్వాత వెస్టిండీస్ గడ్డపై ట్రినిడాడ్‌లోని ప్రతిష్టాత్మక బ్రయాన్ లారా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టుపై అందరి దృష్టి పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు వెస్టిండీస్ సాధించిన స్కోరు కంటే పాకిస్థాన్ ఇంకా 112 పరుగులు వెనుకబడి ఉంది. జులై 2023 తర్వాత మళ్లీ టెస్ట్ ఫార్మాట్‌లో పాక్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న బాబర్ ఆజంపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. క్రీజులోకి వచ్చిన వెంటనే బౌండరీలు బాది మంచి ఊపులో ఉన్నట్లు కనిపించాడు. ఎదుర్కొన్న 38 బంతుల్లో 3 ఆకర్షణీయమైన ఫోర్లు కొట్టాడు. కచ్చితంగా ఈ మ్యాచ్‌లో పెద్ద స్కోరు సాధిస్తాడని అంతా భావించారు. కానీ వెస్టిండీస్ యువ పేసర్ జేడెన్ సీల్స్ వేసిన షార్ట్ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా పొరబడ్డాడు. బంతి బ్యాట్ అంచును తాకుతూ నేరుగా వికెట్ కీపర్ షాయ్ హోప్ చేతికి చిక్కింది. కేవలం 23 పరుగులకే ఔటైన బాబర్‌పై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడు టెస్టుల్లో సెంచరీ సాధించి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది.

ఇది కూడా చదవండి: చైనా గడ్డపై తెలుగమ్మాయి గర్జన.. వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!

ఇవి కూడా చదవండి

కసి తీర్చుకుంటున్న మాజీ కెప్టెన్.. రికార్డు భాగస్వామ్యం

పాకిస్థాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ అజాన్ ఒవైస్ పరుగులేమీ చేయకుండానే డకౌట్‌గా కీమర్ రోచ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాజీ కెప్టెన్ షాన్ మసూద్, మరో ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్‌తో కలిసి అద్భుతంగా ఇన్నింగ్స్ నిర్మించాడు. ఎలాంటి కారణం లేకుండా తనను కెప్టెన్సీ నుంచి తప్పించారన్న కసితో ఉన్న షాన్ మసూద్ విండీస్ బౌలర్ల సహనానికి గట్టి పరీక్ష పెట్టాడు. ఇమామ్ 102 బంతుల్లో 63 పరుగులు చేసి ఔటవ్వగా, ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 155 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. షాన్ మసూద్ 137 బంతులు ఎదుర్కొని 11 ఫోర్ల సాయంతో 88 పరుగులతో క్రీజులో పాతుకుపోయాడు. సెంచరీకి చేరువలో ఉన్న మసూద్, పాక్ జట్టును ఆదుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు.

ఇది కూడా చదవండి: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ.. వేటకు సిద్ధమంటూ సిగ్నల్..!

విండీస్‌ను కుప్పకూల్చిన పాక్ పేసర్లు..

అంతకుముందు వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆటలో వికెట్ కీపర్ షాయ్ హోప్ 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కావెమ్ హాడ్జ్ 84 పరుగులతో రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. పాకిస్థాన్ బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అలీ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో కేవలం 50 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. విండీస్ బ్యాటింగ్ లైనప్‌ను ఏ దశలోనూ కోలుకోకుండా దెబ్బతీశాడు. మహమ్మద్ అబ్బాస్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 63 పరుగులకు 3 వికెట్లతో సత్తా చాటాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us