క్రికెట్ హిస్టరీలో ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆ బాల్ ఆడిన మొగోడు ఎవడో తెలుసా?

పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 161.3 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి చరిత్ర సృష్టించాడు. కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు డెలివరీని ఇంగ్లండ్ ఓపెనర్ నిక్ నైట్ ఎదుర్కొన్నాడు. గంటకు 100.23 మైళ్ల వేగంతో నమోదైన ఈ బంతి, ఇప్పటికీ అత్యంత వేగవంతమైన అధికారిక డెలివరీగా గుర్తింపు పొందింది.

క్రికెట్ హిస్టరీలో ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆ బాల్ ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
Who Faced Shoaib Akhtar Fastest Ball

Updated on: Sep 01, 2026 | 9:05 PM

క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి అంటే ముందుగా గుర్తొచ్చే పేరు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. అతని రన్‌అప్‌కి, అతని బౌలింగ్‌కు భయపడే బ్యాటర్లు చాలా మందే ఉన్నారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బాల్ వేసిన బౌలర్‌గా ఇప్పటికీ అక్తర్ పేరు క్రికెట్‌లో చెక్కు చెదరకుండా ఉంది. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ ఏకంగా 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని వేసి చరిత్ర సృష్టించాడు. గంటకు 100.23 మైళ్ల వేగంతో నమోదైన ఈ డెలివరీ ఇప్పటికీ అత్యంత వేగమైన బంతిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంటోంది.

ఆ బంతిని ఎదుర్కొన్న బ్యాటర్ ఎవరు?

చాలా మందికి బాల్ వేసిన అక్తర్ గుర్తున్నాడు కానీ, అంత వేగంతో వచ్చిన బంతిని సాలిడ్‌గా డిఫెన్స్ చేసి, ఏ మాత్రం భయపడుకుండా ఆడిన బ్యాటర్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఈ చారిత్రక డెలివరీని ఎదుర్కొన్న ఇంగ్లండ్ ఓపెనర్ నిక్ నైట్. 2003 ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ న్యూలాండ్స్ మైదానంలో పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లోనే అక్తర్ 161.3 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నాడు. అయితే ఆ బాల్‌ను నిక్ నైట్ సింపుల్‌గా డిఫెన్స్ ఆడేశాడు. ఆ బాల్‌కే కాదు, ఆ ఓవర్‌లో ఒక్క రన్ కూడా ఇవ్వలేదు అక్తర్.

మ్యాచ్‌లో ఏం జరిగింది?

అయితే అక్తర్ ఈ రికార్డు సృష్టించినప్పటికీ పాకిస్థాన్‌కు ఆ మ్యాచ్‌లో విజయం దక్కలేదు. ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ఆ మ్యాచ్ చేదు అనుభవంగా మిగిలినా, అక్తర్ వేసిన వేగం మాత్రం క్రికెట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ప్రపంచకప్ సమయంలో 160 కిలోమీటర్ల మార్కును దాటిన బౌలర్లలో అక్తర్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్ లీ కూడా ఉన్నాడు. లీ అత్యధికంగా 160.7 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేశాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us