
India vs West Indies, 3rd T20I: భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ నేడు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. దీంతో విండీస్ టీం తొలుత బౌలింగ్ చేయనుంది. ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత జట్టులో శివమ్ దూబే , కుల్దీప్ యాదవ్‌ల స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి , ప్రిన్స్ యాదవ్‌లు జట్టులోకి వచ్చారు. వెస్టిండీస్ జట్టులోకి రొమారియో షెపర్డ్, అకీల్ హోసేన్‌ల స్థానంలో క్వెంటిన్ శాంప్సన్, కీమో పాల్‌లు వచ్చారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి.
గత రెండు మ్యాచ్‌లలో 72.2 ఓవర్ల ఆట జరగగా, మొత్తం 844 పరుగులు నమోదయ్యాయి. అందువల్ల, ఇండోర్‌లో అధిక స్కోర్లు నమోదవుతాయని అంచనా. 2017లో ఇదే మైదానంలో శ్రీలంకతో జరిగిన టీ20ఐలో భారత్ 260 పరుగులు చేసింది. తొలి టీ20లో వెస్టిండీస్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.4 ఓవర్లలో ఛేదించగా, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ 250 పరుగుల లక్ష్యాన్ని తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే సాధించింది.
భారత్, వెస్టిండీస్ ఇప్పటివరకు 33 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో భారత్ 21 మ్యాచ్‌లు గెలవగా, వెస్టిండీస్ 11 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలమైన వేదికగా పరిగణిస్తున్నారు. ఇక్కడి చిన్న బౌండరీల వల్ల ఫోర్లు, సిక్సర్లు కొట్టడం సులభం. గత మూడు వన్డేలలో ఇక్కడ 399, 385, 337 స్కోర్లు నమోదయ్యాయి.
మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత సుమారు 34 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. రాత్రికి అది సుమారు 17 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చు. మంచు కూడా కురిసే అవకాశం ఉంది., దీనివల్ల రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం కష్టమవుతుంది.
వెస్టిండీస్ ప్లేయింగ్ XI : షాయ్ హోప్ (కెప్టెన్, కీపర్), కమిల్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, కీమో పాల్, షమర్ స్ప్రింగర్, రోస్టన్ చేజ్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్.
ఇండియా ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..