Virat Kohli : కోహ్లీ ఒక్క లైక్ కొట్టాడు.. నెట్టింట రచ్చ మొదలైంది.. ఎవరీ జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్లాజ్?

Virat Kohli : జర్మనీకి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ జనవరి 30న తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. గోల్డెన్ అవర్ షాట్స్ అంటూ సూర్యాస్తమయం వేళ దిగిన ఆ ఫోటోలకు విరాట్ కోహ్లీ లైక్ కొట్టినట్లు నెటిజన్లు గుర్తించారు.

Virat Kohli : కోహ్లీ ఒక్క లైక్ కొట్టాడు.. నెట్టింట రచ్చ మొదలైంది.. ఎవరీ జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్లాజ్?
Virat Kohlis Instagram Like On German Influencer Lislajs

Updated on: Apr 17, 2026 | 1:08 PM

Virat Kohli : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాటుతో సెంచరీలు కొట్టినా వార్తే.. సోషల్ మీడియాలో ఒక చిన్న లైక్ కొట్టినా సంచలనమే.. తాజాగా కోహ్లీ ఒక జర్మనీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటోకు లైక్ కొట్టడం ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. మైదానంలో పరుగుల వరద పారించే విరాట్, అప్పుడప్పుడు ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిటీస్‌తో కూడా వార్తల్లో నిలుస్తుంటారు. ఇంతకీ ఆ జర్మనీ భామ ఎవరు? విరాట్ లైక్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

అసలు ఏం జరిగింది?

జర్మనీకి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ జనవరి 30న తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. గోల్డెన్ అవర్ షాట్స్ అంటూ సూర్యాస్తమయం వేళ దిగిన ఆ ఫోటోలకు విరాట్ కోహ్లీ లైక్ కొట్టినట్లు నెటిజన్లు గుర్తించారు. గతంలో కూడా ఒక బాలీవుడ్ నటి పోస్టు విషయంలో ఇలాగే విరాట్ లైక్ వార్తల్లో నిలిచింది. అప్పుడు అది అల్గారిథమ్ తప్పిదం అని ఫ్యాన్స్ సర్దిచెప్పారు. ఇప్పుడు కూడా విరాట్ కావాలని లైక్ కొట్టలేదని, అది ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ వల్ల జరిగిన పొరపాటు అయి ఉంటుందని ఆయన అభిమానులు వాదిస్తున్నారు.

చాహల్ కామెడీ టైమింగ్

ఈ వ్యవహారంపై టీమిండియా స్పిన్నర్, సోషల్ మీడియా కింగ్ యుజ్వేంద్ర చాహల్ తనదైన శైలిలో స్పందించాడు. విరాట్ కోహ్లీ లైక్ కొట్టిన స్క్రీన్ షాట్లు వైరల్ అవుతుండటంతో, చాహల్ అల్గారిథమ్ అంటూ ఒక ఎమోజీని రిప్లైగా ఇచ్చాడు. అంటే కోహ్లీ కావాలని చేయలేదని వెటకారంగా సమర్థించినట్లు కనిపిస్తోంది. విరాట్, చాహల్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే కాబట్టి, ఈ రిప్లై ఇప్పుడు మరింత వైరల్ అవుతోంది.

ఎవరీ లిజ్లాజ్?

ఈ వార్త బయటకు రాగానే అసలు ఈ లిజ్లాజ్ ఎవరు అని అందరూ గూగుల్ చేయడం మొదలుపెట్టారు. ఆమె జర్మనీకి చెందిన ఒక వ్లాగర్ మరియు సింగర్. ఆమె ఎంఎస్సీ సైకాలజీ పూర్తి చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమెకు సుమారు 4.27 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. విశేషం ఏంటంటే, ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో ఆర్సీబీ జట్టుకు తాను పెద్ద ఫ్యాన్ అని, విరాట్ కోహ్లీ అంటే ఇష్టమని ఒక వీడియోను షేర్ చేసింది. ఇది ఆమె పాపులారిటీని అమాంతం పెంచేసింది.

ఫ్యాన్స్ వెర్షన్ ఏంటి?

విరాట్ కోహ్లీ లాంటి సెలబ్రిటీలు పొరపాటున స్క్రీన్ స్క్రోల్ చేస్తున్నప్పుడు లైక్ బటన్ ప్రెస్ అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీ కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల వారిని ఆయన ఫాలో అవుతుంటారని, అందులో భాగంగానే లైక్ కొట్టి ఉండొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా, ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న వేళ కోహ్లీకి సంబంధించిన ఈ చిన్న విషయం కూడా పెద్ద సెన్సేషన్ గా మారింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us