Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది.. గత తొమ్మిది ఇన్నింగ్స్‎ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని భారత కెప్టెన్..

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‎లో భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 35 పరుగుల వద్ద ఔటయ్యాడు...

Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది.. గత తొమ్మిది ఇన్నింగ్స్‎ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని భారత కెప్టెన్..
Virat Kohli
Follow us

|

Updated on: Dec 27, 2021 | 9:44 AM

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‎లో భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 35 పరుగుల వద్ద ఔటయ్యాడు. విరాట్ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎన్గిడికి చిక్కాడు. స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడు 71వ సెంచరీ చేయడం కోసం కోహ్లీ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.

WTC ఫైనల్, సౌతాంప్టన్, 2వ ఇన్నింగ్స్ జూన్ 2021లో సౌతాంప్టన్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 13 పరుగుల వద్ద ఔటయ్యాడు. కైల్ జేమీసన్ బౌలింగ్‎లో వికెట్ కీపర్ బిజె వాట్లింగ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

నాటింగ్‌హామ్ టెస్ట్ 2021లో భారత్‌ ఇంగ్లాండ్‌ పర్యటనలో తొలి టెస్టు నాటింగ్‌హామ్‌లో జరిగింది. జేమ్స్ అండర్సన్ వేసిన బంతిని విరాట్ కోహ్లీ బ్యాట్‎తో డ్రైవ్ చేయబోయి వికెట్ వెనుక నిలబడిన జోస్ బట్లర్ క్యాచ్ ఇచ్చాడు. దీంతో విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో ఖాతా తెరవలేకపోయాడు.

లార్డ్స్ టెస్ట్ ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా లార్డ్స్‌ వేదికగా భారత్‌ రెండో టెస్టు ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 42 పరుగులు చేశాడు. ఆలీ రాబిన్సన్ బౌలింగ్‎లో మొదటి స్లిప్ ఉన్న జో రూట్ చేతికి చిక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 20 పరుగులకే ఔటయ్యాడు. జోస్ బట్లర్‎కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

లీడ్స్ టెస్ట్ ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా లీడ్స్‌లో మూడో టెస్టు ఆడింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ 7 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్‎లో ఔటయ్యాడు. టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ చేశాడు. 55 పరుగులు చేసి రాబిన్సన్ వేసిన బంతికి బోల్తాపడ్డాడు.

ఓవల్ టెస్ట్ ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా ఓవల్‌ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్‌ జరిగింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి మళ్లీ హాఫ్‌ సెంచరీ సాధించగా.. ఆ తర్వాత రాబిన్‌సన్‌ వేసిన బంతికి వికెట్‌ కీపర్‌ జానీ బెయిర్‌స్టో క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి 6 పరుగుల దూరంలో 44 పరుగుల వద్ద ఔటయ్యాడు.

Read Also.. Bipul Sharma: రిటైర్మెంట్ ప్రకటించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బిపుల్ శర్మ.. అమెరికాలోఆడేందుకు నిర్ణయం..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో