IPL 2021: నటరాజన్ స్థానంలో జమ్మూ కశ్మీర్ బౌలర్.. హైదరాబాద్‌ జట్టులో ఎన్ని రోజులుంటాడంటే?

|

Sep 24, 2021 | 6:50 PM

Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండవ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం పలు ఎదురుదెబ్బలతో కొట్టుమిట్టాడుతోంది.

IPL 2021: నటరాజన్ స్థానంలో జమ్మూ కశ్మీర్ బౌలర్.. హైదరాబాద్‌ జట్టులో ఎన్ని రోజులుంటాడంటే?
Ipl 2021, Umran Malik
Follow us on

Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండవ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం పలు ఎదురుదెబ్బలతో కొట్టుమిట్టాడుతోంది. కోవిడ్‌తో టి నటరాజన్ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. దీంతో స్వల్పకాలికంగా అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎస్‌ఆర్‌హెచ్ టీం మీడియం-పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ని జట్టులోకి తీసుకున్నారు.

సెప్టెంబర్ 22 న ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తో మ్యాచ్‌కు ముందు నటరాజన్ కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలాడు. దీంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్‌ టీం ప్రకటించింది.

మాలిక్ జమ్మూ కాశ్మీర్ తరపున ఒక టీ 20, లిస్ట్ ఏ మ్యాచ్ ఆడాడు. మొత్తం నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ టీంలో ఇప్పటికే నెట్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

ఐపీఎల్ రూల్స్ ప్రకారం, “6.1 (సి) ప్రకారం ఏదైనా జట్టు బయో-బబుల్ వాతావరణంలో ఒరిజినల్ స్క్వాడ్ సభ్యుడు తిరిగి ప్రవేశించడానికి అనుమతించేంత వరకు ఫ్రాంఛైజీలు స్వల్పకాలిక రీప్లేస్‌మెంట్ కోసం మరో ప్లేయర్‌‌ను తీసుకోవచ్చు” అని పేర్కొంది. దీంతో నటరాజన్ కోలుకునే వరకు మాలిక్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉంటాడు.

రెండు భాగాల ఐపీఎల్ 2021 సమయంలో సన్‌రైజర్స్ ఆటగాడు కోవిడ్ -19 పాజిటివ్ తేలడం ఇది రెండోసారి. మేలో వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా పాజిటివ్‌గా తేలాడు. ప్రస్తుతం నటరాజన్‌ కోవిడ్ బారిన పడ్డాడు.

Also Read: RCB vs CSK Live Score, IPL 2021: రికార్డులన్నీ ధోని సేన వైపే.. కోహ్లీ కెప్టెన్సీకి కీలకమైన మ్యాచ్.. మరికొద్దిసేపట్లో దిగ్గజాల పోరు షురూ

IPL 2021 CSK vs RCB: భారీ స్కోర్‌కు సిద్ధమైన ఎంఎస్ ధోని.. ఆర్‌సీబీపై మహి రికార్డులు ఏం చెబుతున్నాయో తెలుసా?

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ.. ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న కీలక బ్యాట్స్‌మెన్.. కారణం ఏంటంటే?