AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 6, 0, 6, 6, 6, 6.. ఓకే ఓవర్లో తుషార్ తుఫాన్ ఇన్నింగ్స్.. 17 బంతుల్లో విధ్వంసం..!

Tushar Raheja 5 Sixes: తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో కొందరు ప్లేయర్స్ స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు ఫుల్ పైసా వసూల్‌లాంటి ఉత్సాహాన్ని అందిస్తున్నారు. తాజాగా, ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిళాన్స్ యువ సారథి తుషార్ రహేజా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెన్నై మైదానాన్ని హోరెత్తించాడు. ఒకే ఓవర్‌లో 5 భారీ సిక్సర్లు బాది ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బతీసిన తీరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Video: 6, 0, 6, 6, 6, 6.. ఓకే ఓవర్లో తుషార్ తుఫాన్ ఇన్నింగ్స్.. 17 బంతుల్లో విధ్వంసం..!
Tushar Raheja 5 Sixes
Venkata Chari
|

Updated on: Aug 21, 2026 | 1:38 PM

Share

Tushar Raheja 5 Sixes: తమిళనాడు ప్రీమియర్ లీగ్ 23వ లీగ్ మ్యాచ్‌లో మదురై పాంథర్స్‌తో జరిగిన పోరులో తిరుప్పూర్ జట్టు కెప్టెన్ తుషార్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. చేపాక్ స్టేడియంలో 158 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆ జట్టు, ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌ పూర్తయ్యే సమయానికి 36 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో లెగ్ స్పిన్నర్ రోహన్ భూత్రా వేసిన పవర్‌ప్లే ఆఖరి ఓవర్‌లో తుషార్ ఎదురుదాడికి దిగాడు. తొలి బంతినే లాంగాఫ్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతి డాట్ అయినప్పటికీ, తర్వాతి నాలుగు బంతుల్లో వరుసగా 4 సిక్సర్లు బాది మైదానాన్ని హోరెత్తించాడు. ఈ ఒక్క ఓవర్‌లోనే ఏకంగా 30 పరుగులు పిండుకోవడంతో తిరుప్పూర్ స్కోరు ఒక్కసారిగా 66 పరుగులకు దూసుకెళ్లింది.

17 బంతుల్లో 48 పరుగులు.. తృటిలో తప్పిన అర్ధశతకం..

ఈ మ్యాచ్‌లో తుషార్ ఆడిన ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకం. కేవలం 17 బంతుల్లోనే 7 భారీ సిక్సర్ల సహాయంతో 48 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. షోయబ్ మహ్మద్ ఖాన్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరగడంతో కేవలం 2 పరుగుల తేడాతో అర్ధ సెంచరీ చేజారినప్పటికీ, జట్టును విజయపథంలో నిలిపేందుకు అవసరమైన బలమైన పునాదిని వేశాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో వైభవ్‌కు చోటు.. ఓపెనర్లుగా ఎవరంటే?

దేశవాళీలో దూసుకుపోతున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్..

25 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తమిళనాడు దేశవాళీ సర్క్యూట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. డిసెంబర్ 2024లో తమిళనాడు జట్టు తరఫున అరంగేట్రం చేసిన తుషార్, ఇప్పటివరకు రాష్ట్ర జట్టు తరఫున 6 లిస్ట్-ఎ, 9 టీ20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. గత సీజన్ టీఎన్‌పీఎల్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 488 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ప్రస్తుత 2026 సీజన్‌లోనూ 6 ఇన్నింగ్స్‌ల్లో దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో 344 పరుగులు రాబట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఎక్కువమంది చదివినది:SL vs IND: లంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ దూకుడు.. ఆ జట్టు ఔట్..?

క్లిష్ట సమయాల్లో నాయకుడిగా బాధ్యత తీసుకుని మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా తుషార్ సొంతం. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే త్వరలోనే ఆయనకు జాతీయ స్థాయి సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us