DK Gaekwad: టీమిండియా అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత.. బీసీసీఐతో సహా పలువురి ఆటగాళ్ల సంతాపం

|

Feb 13, 2024 | 3:37 PM

భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆటగాడు దత్తాజీరావు కృష్ణారావు గైక్వాడ్ (డీకే గైక్వాడ్) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతోన్న DK గైక్వాడ్ మంగళవారం (ఫిబ్రవరి 13) తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు సుమారు 95 ఏళ్లు. గైక్వాడ్‌ మరణ వార్తను అతని కుమారుడు, టీమిండియా క్రికెటర్‌, మాజీ కోచ్‌ అన్షుమాన్ గైక్వాడ్ ధ్రువీకరించారు

DK Gaekwad: టీమిండియా అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత.. బీసీసీఐతో సహా పలువురి ఆటగాళ్ల సంతాపం
Dattajirao Gaikwad
Follow us on

భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆటగాడు దత్తాజీరావు కృష్ణారావు గైక్వాడ్ (డీకే గైక్వాడ్) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతోన్న DK గైక్వాడ్ మంగళవారం (ఫిబ్రవరి 13) తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు సుమారు 95 ఏళ్లు. గైక్వాడ్‌ మరణ వార్తను అతని కుమారుడు, టీమిండియా క్రికెటర్‌, మాజీ కోచ్‌ అన్షుమాన్ గైక్వాడ్ ధ్రువీకరించారు. టీమిండియా తొలితరం టెస్ట్‌ క్రికెటర్‌ గా, దేశంలో అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్‌గా దత్తాజీరావు గైక్వాడ్‌ కు గుర్తింపు ఉంది. 1952లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన దత్తాజీ అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 11 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.తన 9 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో, 18.42 సగటుతో 350 పరుగులు సాధించాడు. అలాగే దేశవాళీ క్రికెట్‌లో బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన డీకే గైక్వాడ్ 110 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 5,788 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 23 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే తన ఆల్ రౌండర్ ఆటతో దేశవాళీ కోర్టులో మెరిసిన దత్తాజీరావు కృష్ణారావు గైక్వాడ్ కూడా లెగ్ బ్రేక్ బౌలింగ్ తో 25 వికెట్లు పడగొట్టాడు. రిటైర్మెంట్ తర్వాత గైక్వాడ్‌ బరోడా క్రికెట్ అసోసియేషన్ కోసం అభివృద్ధికి పాటు పడ్డారు. యువ క్రికెటర్లకు ప్రోత్సాహం అందించాడు.

భారత క్రికెట్ రంగానికి దత్తాజీరావు కృష్ణారావు గైక్వాడ్ చేసిన కృషికి గుర్తింపుగా.. 2020లో పోస్ట్స్ డిపార్ట్‌మెంట్ఆయన ఫొటోతో ప్రత్యేక పోస్టర్‌ కవర్ విడుదల చేసింది. దత్తాజీరావు కృష్ణారావు గైక్వాడ్ కుమారుడు అన్షుమాన్ గైక్వాడ్ కూడా టీమిండియా మాజీ ఆటగాడే. భారత్ తరఫున 40 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్ 1985 పరుగులు చేశాడు. 15 వన్డేల్లో 269 పరుగులు కూడా చేశాడు. ఆ తర్వాత అన్షుమన్ గైక్వాడ్ టీమ్ ఇండియా కోచ్‌గా పనిచేశాడు. గైక్వాడ్‌ మరణ వార్త తెలుసుకున్న బీసీసీఐ ఆయనకు నివాళులర్పించింది. ‘భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, టీమిండి యా తొలితరం టెస్టు క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ మృతి పట్ల బీసీసీఐ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. ఆయన 11 టెస్టుల్లో ఆడాడు. 1959లో ఇంగ్లాండ్ పర్యటనలో జట్టుకు నాయకత్వం వహించాడు. గైక్వాడ్‌ కెప్టెన్సీలో, బరోడా 1957-58 సీజన్‌లో రంజీ ట్రోఫీని కూడా గెలుచుకుంది. గైక్వాడ్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం’ అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

బీసీసీఐ ట్వీట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..