KL Rahul: ‘మీపై మరింత గౌరవం పెరిగిందయ్యా రాహుల్’.. పేద విద్యార్థికి సాయం చేసిన టీమిండియా క్రికెటర్

|

Oct 09, 2024 | 7:32 AM

టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గతంలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొని అనేక మందికి సహాయం చేశారీ టీమిండియా స్టార్ క్రికెటర్. ముఖ్యంగా బాగల్‌కోట్‌కు చెందిన విద్యార్థి అమృత్ మావినకట్టె కాలేజీ ఫీజు చెల్లించి తన విశాల హృదయాన్ని చాటుకుంటున్నాడు

KL Rahul: మీపై మరింత గౌరవం పెరిగిందయ్యా రాహుల్.. పేద విద్యార్థికి సాయం చేసిన టీమిండియా క్రికెటర్
KL Rahul
Follow us on

టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గతంలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొని అనేక మందికి సహాయం చేశారీ టీమిండియా స్టార్ క్రికెటర్. ముఖ్యంగా బాగల్‌కోట్‌కు చెందిన విద్యార్థి అమృత్ మావినకట్టె కాలేజీ ఫీజు చెల్లించి తన విశాల హృదయాన్ని చాటుకుంటున్నాడు. ఇప్పుడు అదే అమృత్ సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ ఫీజును కేఎల్ రాహుల్ చెల్లించారు. దీంతో ఈ టీమిండియా వికెట్ కీపర్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బాగల్‌కోట్ జిల్లా మహాలింగపురానికి చెందిన అమృత్ మావినకట్టి ప్రతిభావంతుడైన విద్యార్థి. పేదరికం వెక్కిరిస్తోన్నా పెద్ద చదువులు అభ్యసించాలని కంకణం కట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే కేఎల్‌ఈ టెక్నలాజికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నహుబ్లీలోని బీవీబీ కాలేజీ క్యాంపస్‌లో సీటు దక్కించుకున్నాడు. అయితే ఉన్నత చదువులకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు రాహుల్. అమృత్ మొదటి సంవత్సరం మొత్తం ఫీజు చెల్లించాడు. ఇప్పుడురెండో సంవత్సరం ఫీజు కూడా చెల్లించి తన మాటను నిలబెట్టుకున్నాడు.

హుబ్బళ్లిలో విలేకరులతో అమృత మావినకట్టి మాట్లాడుతూ.. ‘గతేడాది కళాశాలలో అడ్మిషన్ పొందేందుకు కేఎల్ రాహుల్ సహకరించారన్నారు. రెండో ఏడాది కూడా ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నా రెండవ సంవత్సరం చదువుకు 75,000 రూపాయలు చెల్లించారు. నా చదువుకు ఆర్థికంగా సహకరించిన కెఎల్‌ రాహుల్‌, మంజునాథ్‌ హెబాసురు, నితిన్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇవి కూడా చదవండి

‘థ్యాంక్స్ రాహుల్ అన్నా’!..

అమృత్ మావినకట్టి పీయూసీలో 600 మార్కులకు 571 మార్కులు సాధించాడు. అయితే తదుపరి చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త మంజునాథ్, నితిన్ సహాయంతో కేఎల్ రాహుల్‌ను ఆశ్రయించాడు. వెంటనే రాహుల్ మొత్తం ఖర్చు బాధ్యత తీసుకున్నారు. అమృతకు KLE టెక్నలాజికల్ యూనివర్శిటీలో సీటు వచ్చేలా ఏర్పాట్లు కూడా చేశాడు. ఇప్పుడు, కేఎల్ రాహుల్ తన రెండవ సంవత్సరం అకడమిక్ ఫీజులను కూడా చెల్లించాడు. అంతకుముందు ధార్వాడలోని సిద్దేశ్వర కాలనీలో నిరుపేద విద్యార్థిని చదువు కోసం కేఎల్ రాహుల్ ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు మరోసారి కేఎల్ రాహుల్ అమృత్‌కు సహాయ హస్తం అందించారు.
అంతకుముందు ధార్వాడలోని సిద్దేశ్వర కాలనీలో నిరుపేద విద్యార్థిని చదువు కోసం కేఎల్ రాహుల్ ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు మరోసారి కేఎల్ రాహుల్ అమృత్‌కు సహాయ హస్తం అందించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ కల్ిక్ చేయండి..