Team India Vice Captain: టీ20 తర్వాత వన్డే జట్టులో కేఎల్ రాహుల్‌కు పెద్ద బాధ్యతను అప్పగించే ఛాన్స్ ఉంది. రోహిత్ టీ20 కెప్టెన్ అయిన తర్వాత, కేఎల్ రాహుల్ టీ20 వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు రోహిత్ శర్మకు వన్డే బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ.. వైస్ కెప్టెన్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ తదుపరి వైస్ కెప్టెన్ అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అద్భుతంగా రాణింస్తోన్న కేఎల్ రాహుల్, మరో 6 నుంచి 7 సంవత్సరాలు ఉండనుంది. అందుకే టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్‌గా కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సమక్షంలో ఎన్నో అంశాలను నేర్చుకునే అవకాశం ఉంది.
దక్షిణాఫ్రికా పర్యటన కోసం బుధవారం టెస్టు జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఈ సమయంలో, రోహిత్ శర్మ వన్డే కెప్టెన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వన్డే జట్టును మాత్రం ఇంకా ప్రకటించలేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ కూడా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టూర్‌కు సంబంధించిన జట్టును త్వరలో ప్రకటించనున్నారు. అప్పుడే కేఎల్ రాహుల్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.
గత 2 సంవత్సరాల్లో రాహుల్ ప్రదర్శన వన్డేలలో అద్భుతంగా ఉంది. గత 2 సంవత్సరాలలో అత్యధిక సెంచరీలు కూడా సాధించాడు. జనవరి 1, 2020 నుంచి భారత బ్యాట్స్‌మెన్‌ల వన్డే రికార్డులను పరిశీలిస్తే, రాహుల్ అత్యధికంగా 2 సెంచరీలు సాధించాడు. ఈ సమయంలో కేఎల్ రాహుల్ అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కూడా నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. కేఎల్ రాహుల్ 12 ఇన్నింగ్స్‌ల్లో 62 సగటుతో 620 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సాధించాడు. అంటే రాహుల్ ప్రతీ ఇన్నింగ్స్‌లో 50 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ 560, రోహిత్ శర్మ 6 ఇన్నింగ్స్‌లలో 261 పరుగులు పూర్తి చేశారు.