AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: ఇక లాభం లేదు గంభీర్.. సిరీస్ గెలవాలంటే ఆ వజ్రాయుధాన్ని దింపాల్సిందే..!

IND vs WI Cricket: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా 15 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూరవంశికి తుది జట్టులో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్‌లో రాణించిన వైభవ్, గౌతం గంభీర్ హయాంలో అవకాశాలు కోల్పోవడంపై వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నలు సంధించారు.

IND vs WI: ఇక లాభం లేదు గంభీర్.. సిరీస్ గెలవాలంటే ఆ వజ్రాయుధాన్ని దింపాల్సిందే..!
Ind Vs Wi
Venkata Chari
|

Updated on: Oct 17, 2026 | 6:45 AM

Share

Vaibhav Suryavanshi: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి, ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో గెలుపుతో సిరీస్ 2-2తో సమమై, చివరి టీ20 మ్యాచ్ బెంగళూరు వేదికగా నిర్ణయాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో, టీమిండియాపై, ముఖ్యంగా జట్టు ఎంపిక విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు, క్రికెట్ మాజీలు టీం మేనేజ్‌మెంట్‌ను దుమ్మెత్తి పోస్తున్నారు. అందరికీ అవకాశం కల్పించినప్పటికీ, ఒక యువ ఆటగాడికి మాత్రం మొండి చేయి చూపడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాంటప్పుడు అతడిని అసలు జట్టులోకి ఎంపిక చేశారంటూ నిలదీస్తున్నారు.

ఈ చర్చకు ప్రధాన కారణం 15 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూరవంశి. అతడికి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాలుగో టీ20 మ్యాచ్‌లోనైనా వైభవ్‌కు అవకాశం లభిస్తుందని అంతా భావించారు. కానీ, టీం మేనేజ్‌మెంట్ ఎలాంటి మార్పులు లేకుండా, పాత జట్టుతోనే బరిలోకి దిగింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో విమర్శలు మరింత పెరిగాయి. వైభవ్ సూరవంశికి తుది జట్టులో చోటు దక్కకపోవడం, అతడి కెరీర్‌పై ప్రభావం చూపుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

వైభవ్ సూరవంశి ప్రదర్శన, అతడికి లభించిన అవకాశాలపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్‌లో, ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతం గంభీర్ కోచింగ్‌లో ఆసక్తికర పోలిక తెరపైకి వచ్చింది. వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా బాధ్యతలు చూపిన సమయాల్లో వైభవ్ ఐదు మ్యాచ్‌ల్లో లభించిన అవకాశాల్ని 100 శాతం సద్వినియోగం చేసుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో మూడు మ్యాచ్‌లతో పాటు, ఆసియా క్రీడల్లో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో వైభవ్ బరిలోకి దిగి అద్భుతంగా రాణించాడు. అతడి ప్రతిభను లక్ష్మణ్ గుర్తించి ప్రోత్సహించాడన్న అభిప్రాయం ఉంది.

అయితే, ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న గౌతం గంభీర్ హయాంలో పరిస్థితి భిన్నంగా ఉంది. వైభవ్ సూరవంశి జట్టులో భాగమైన 14 మ్యాచ్‌ల్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే అతడికి తుది జట్టులో చోటు దక్కింది. ఇది వైభవ్ వంటి ప్రతిభావంతుడైన యువ ఆటగాడికి సరైన అవకాశాలు ఇవ్వకపోవడాన్ని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే, వైభవ్ సూరవంశికి తగినన్ని అవకాశాలు ఇవ్వకపోవడంపై భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఓ 15 ఏళ్ల కుర్రాడు జాతీయ జట్టుకే ఎంపికయ్యాడంటే అతడు తప్పకుండా ఓ టాలెంట్ పరుడై ఉండాలి. అలాంటి ప్రతిభావంతులనే సెలెక్టర్లు ఎంపిక చేస్తారు. కానీ, టీం మేనేజ్‌మెంట్ తమకు నచ్చినట్లుగా తుది జట్టును ఎంపిక చేస్తోంది” అని సెహ్వాగ్ విమర్శించారు. అలాంటప్పుడు జట్టుకు ఎంపిక చేయడం ఎందుకని ఆయన నిలదీశారు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు టీ20లలో అందరికీ అవకాశం ఇచ్చారు, ఒక్క వైభవ్‌కు తప్ప. “ఎందుకు ఇలా జరుగుతుందో కోచింగ్ డిపార్ట్‌మెంట్‌కే తెలియాలి” అని సెహ్వాగ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

హైదరాబాద్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో ప్రస్తుతం సిరీస్ రెండు-రెండుతో సమమైంది. ఇక సిరీస్ డిసైడర్ మ్యాచ్ బెంగళూరు వేదికగా చివరి ఐదో టీ20 మ్యాచ్‌లో తాడో పేడో తేల్చుకోనుంది టీమిండియా. అయితే ఈ కీలక మ్యాచ్‌లోనైనా వైభవ్ సూరవంశిని ఆడిస్తారా అంటే 100% ఆడించే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తుంది. గౌతం గంభీర్ కోచ్‌గా తన మొండి వైఖరే దీనికి కారణమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో టీం మేనేజ్‌మెంట్ వైఫల్యంపై విమర్శలు కొనసాగుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సిరీస్ గెలవాలంటే ఆ వజ్రాయుధాన్ని దింపాల్సిందే..!
సిరీస్ గెలవాలంటే ఆ వజ్రాయుధాన్ని దింపాల్సిందే..!
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని విమానానికి బాంబ్ బెదిరింపు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని విమానానికి బాంబ్ బెదిరింపు
పండుగ వేళ గోల్డ్ కొనేవారికి ఊరట.. ధరలు ఒక్కసారిగా ఢమాల్..
పండుగ వేళ గోల్డ్ కొనేవారికి ఊరట.. ధరలు ఒక్కసారిగా ఢమాల్..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
నవరాత్రుల ఏడో రోజు అమ్మవారి కాలరాత్రి రూపం.. పూజా విధానం..
నవరాత్రుల ఏడో రోజు అమ్మవారి కాలరాత్రి రూపం.. పూజా విధానం..
కిక్ సినిమాలో నటించిన ఈ భామ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా
కిక్ సినిమాలో నటించిన ఈ భామ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా