Virat Kohli vs BCCI: వన్డే కెప్టెన్సీ వివాదానికి సెప్టెంబర్ ప్రకటనే కారణం: సునీల్ గవాస్కర్

|

Dec 16, 2021 | 12:19 PM

నిన్న విరాట్ మాటలు బీసీసీఐ పెద్దలను వేలెత్తి చూపేలా ఉన్నాయి. అదే మాటలను వేరే రకంగాను చెప్పే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే కోహ్లీ సెప్టెంబర్‌లో చేసిన ప్రకటన కూడా వన్డే కెప్టెన్సీ వివాదానికి కారణమై ఉండొచ్చని..

Virat Kohli vs BCCI: వన్డే కెప్టెన్సీ వివాదానికి సెప్టెంబర్ ప్రకటనే కారణం: సునీల్ గవాస్కర్
Sunil Gavaskar
Follow us on

India Cricket Team: టీమ్ ఇండియా పూర్తి సమయం వైట్ బాల్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ రావడంతో, చాలా మంది అభిమానులు, నిపుణులు ఈ ఆటగాళ్ల మధ్య విభేదాలపై ఊహాగానాలు చేస్తున్నారు. పుకార్లు చెలరేగడంతో నిన్న విరాట్ కోహ్లీ మరోసారి వివరణ ఇచ్చాడు. ఇది ఇప్పటికే చాలా సందర్భాలలో చర్చల్లోకి వచ్చింది. దీనిని వీరిద్దరూ ఖండించారు కూడా. అయితే దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బీసీసీఐ ఇటీవలి నిర్ణయంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ తరువాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇండియా టుడేతో మాట్లాడిన గవాస్కర్, నిన్న విరాట్ మాటలు బీసీసీఐ పెద్దలను వేలెత్తి చూపేలా ఉన్నాయి. అదే మాటలను వేరే రకంగాను చెప్పే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే కోహ్లీ సెప్టెంబర్‌లో చేసిన ప్రకటన కూడా వన్డే కెప్టెన్సీ వివాదానికి కారణమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

“మీరు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నందున మనం ఏం మాట్లాడుతున్నామో ఆలోచించాల్సి ఉంటుంది. విరాట్ మాటలు అధికారంలో ఉన్నవారిని కలవరపెడుతాయని నేను భావిస్తున్నాను’ అని ఆయన అన్నారు. “టెస్ట్, వన్డేలలో భారత్‌కు నాయకత్వం వహించడానికి నేను అందుబాటులో ఉంటాననే ఆ లైన్‌ని మార్చవచ్చని నేను భావిస్తున్నాను” అని గవాస్కర్ తెలిపారు.

ఈ విషయంలో కోహ్లీ పట్ల వ్యతిరేక భావన గురించి మాట్లాడాడు. కానీ, అతనిని సమర్థించాడు. “టెస్ట్, వన్డేలకు అతను కెప్టెన్‌గా ఉంటాడనే అంచనాలు అతనిపై ఈ చిన్న వ్యతిరేక భావన రావడానికి ఒక కారణం కావచ్చు. కాకపోతే కోహ్లీ ఐసీసీ ఈవెంట్‌లను గెలవలేదు, ద్వైపాక్షిక ఈవెంట్‌లను గెలుచుకున్నాడు. స్వదేశంలో ఉన్నా, బయట ఉన్నా కోహ్లీ భారత జట్టును విజయపథంలో నడిపించాడు. కాబట్టి అతని నాయకత్వ సామర్థ్యాల పట్ల ప్రజలు అసంతృప్తి చెందారనడానికి ఎటువంటి కారణం లేదు” అని గవాస్కర్ తెలిపారు.

బుధవారం కూడా కోహ్లి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రోహిత్‌తో తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడడనే పుకార్లకు కూడా రోహిత్ ముగింపు పలికాడు. తాను ఎప్పుడూ బీసీసీఐని విశ్రాంతి కోరలేదని, ఎంపికకు అందుబాటులో ఉంటానని కోహ్లీ మీడియాతో పేర్కొన్నాడు.

అధికారిక ప్రకటనకు గంటన్నర ముందు వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుందని కోహ్లీ పేర్కొన్నాడు. “తీసుకున్న నిర్ణయం గురించి జరిగిన కమ్యూనికేషన్ గురించి ఏది చెప్పినా సరికాదు. టెస్టులకు ఎంపికయ్యే గంటన్నర ముందు నన్ను సంప్రదించారు. చీఫ్ సెలక్టర్ నాతో టెస్ట్ జట్టు గురించి చర్చించారు. కాల్ ముగిసేలోపు, నేను ఇకపై వన్డే కెప్టెన్‌గా ఉండనని ఐదుగురు సెలక్టర్లు నిర్ణయించుకున్నారని తెలిపారు. దీని గురించి ముందస్తుగా ఎటువంటి సమాచారం లేదు” అని కోహ్లీ మీడియా సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Also Read: Watch Video: సూపర్ మ్యాన్ కంటే స్పీడ్.. ఇంగ్లండ్ కీపర్ డైవింగ్ క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా.. ‘జోస్ ది బాస్’ అంటూ కామెంట్లు

Happy Birthday Jack Hobbs: 199 సెంచరీలు.. 61 వేలకు పైగా పరుగులు.. రికార్డులకే దడ పుట్టించిన బ్యాట్స్‌మెన్..!