Rohit Sharma Retirement: రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చేసిన రోహిత్.. ఆరోజే తప్పుకుంటానంటూ కీలక వ్యాఖ్యలు..

|

Mar 09, 2024 | 8:29 PM

Rohit Sharma: ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో విజయం సాధించిన తర్వాత రిటైర్మెంట్ ప్రశ్నపై రోహిత్ శర్మ మౌనం వీడాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ జియో సినిమాతో మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్ గురించి ప్రకటన చేయడంతో పాటు ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటాడో కూడా ప్రకటించాడు.

Rohit Sharma Retirement: రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చేసిన రోహిత్.. ఆరోజే తప్పుకుంటానంటూ కీలక వ్యాఖ్యలు..
Rohit Sharma Retirement
Follow us on

Rohit Sharma Retirement: వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup 2023) లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలో టీమిండియా (Team India) అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఓడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రోహిత్ శర్మ రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి అందరూ పుకార్లు వ్యాప్తి చేయడం ప్రారంభించారు. అయితే వీటన్నింటిని అటకెక్కించిన రోహిత్.. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించి మళ్లీ రంగంలోకి దిగాడు. ఆ తర్వాత, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడడం ద్వారా రోహిత్ రెగ్యులర్ ఫార్మాట్‌లోకి తిరిగి వచ్చినట్లు ధృవీకరించాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్నాడు. కానీ, ధర్మశాలలో సిరీస్ గెలిచి, ఐదో టెస్టులో విజయం నమోదు చేసిన తర్వాత, రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రశ్నపై మౌనం వీడాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ జియో సినిమాతో మాట్లాడాడు. రిటైర్మెంట్ గురించి ప్రకటన చేయడంతో పాటు ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటాడో కూడా చెప్పాడు.

ఇవి కూడా చదవండి

హిట్‌మ్యాన్ ఎప్పుడు రిటైర్ అవుతాడు?

రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రణాళికలపై, ‘నేను బాగా ఆడడం లేదని అనిపించిన రోజు క్రికెట్ నుంచి రిటైర్ అవుతాను. కానీ గత రెండు-మూడేళ్లలో నేను నా ఆటను మెరుగుపరుచుకున్నానని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను క్రికెట్‌కు దూరం కాను’ అంటూ రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందించాడు.

‘రికార్డుల గురించి పట్టించుకోను. భారీ స్కోర్స్ చేయడంపైనా ఫోకస్ పెట్టాను. అలాగే, టీంకు అనుగుణంగా ఆడటంపై ఫోకస్ చేస్తున్నాను. జట్టులోని యువ ప్లేయర్స్ చాలా స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఈ మార్పు ప్రస్తుతం కనిపిస్తోంది. వ్యక్తిగత స్కోర్ల కంటే, జట్లు ప్రయోజనాల కోసం ఆడాలి. మనసు ప్రశాంతంగా ఉంచి నిర్భయంగా ఆడితే పరుగుల వర్షం కురుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ కెరీర్ ఎలా ఉందంటే?


రోహిత్ శర్మ కెరీర్ గురించి మాట్లాడితే ఇప్పటివరకు 59 టెస్టులు, 262 వన్డేలు, 151 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టుల్లో 12 సెంచరీలు, 17 అర్ధసెంచరీలతో సహా 4138 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ వన్డేల్లో 31 సెంచరీలు, 55 అర్ధసెంచరీలతో 10709 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ 5 సెంచరీలు, 29 అర్ధసెంచరీలతో 3974 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..