టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో భాగంగా భారత్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. అబుదాబిలో జరిగే ఈ మ్యాచ్‌లో ఇండియా ముగ్గురు స్పిన్నర్లను ఆడించవచ్చని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ అదనపు స్పిన్నర్‌ను ఆడించాలని గవాస్కర్ చెప్పాడు. వరుణ్ చక్రవర్తి స్థానంలో ఆర్ అశ్విన్‌ను తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్‌ను ఆడగలదని పేర్కొన్నాడు. “టీ20 ప్రపంచ కప్ 2021లో ఇప్పటివరకు భారత్ తమ ఇద్దరు స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజాలను ఆడింది. అయితే ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. బౌలర్లు ఇప్పటివరకు ఒత్తిడిలో ఉన్నారు. పాక్ చేతిలో10 వికెట్ల తేడాతో, న్యూజిలాండా చేతిలో 8 వికెట్ల తేడాతో ఇండియా ఓడిపోయింది. భారత్ తన మిగిలిన 3 మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాలని” గవాస్కర్ అన్నాడు.
“బహుశా ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ లేదా మహమ్మద్ షమీ ఆడకపోవచ్చు. 2 సీమర్లు, 3 స్పిన్నర్లతో వారిలో ఎవరో ఒక్కరు తప్పుకోవాల్సిందే. హార్దిక్ మీడియం పేస్‌లో 2 ఓవర్లు వేయగలిగితే, అప్పుడు జట్టులో ముగ్గురు పేసర్లు ఉంటారు’ అని గవాస్కర్ చెప్పాడు. “ఆర్ అశ్విన్ లాంటి టాప్ క్లాస్ స్పిన్నర్, అతను రైట్ హ్యాండర్‌కి బౌలింగ్ చేసినా, లెఫ్ట్ హ్యాండర్‌కి బౌలింగ్ చేసినా తేడా లేదన్నాడు. “ఇక్కడ పిచ్‌లు నెమ్మదిగా ఉన్నాయి. ఇప్పటి వరకు స్పిన్ ఆడటంలో బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నారు.” అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌ను తక్కువ అంచనా వెయ్యొద్దని అన్నాడు.
మహ్మద్ నబీ నేతృత్వంలోని ఆప్ఘాన్ నమీబియా, స్కాట్‌లాండ్‌ను ఓడించిందని గుర్తు చేశాడు. “ఇటీవలి కాలంలో భారత బ్యాట్స్‌మెన్ స్పిన్ ఆడే విషయంలో, ముఖ్యంగా హ్యాండ్ డెలివరీల ఆడటంలో కొంత బలహీనతను కనబరిచారు. ఆప్ఘానిస్తాన్ మ్యాచ్‌లో జాగ్రత్తగా ఉండాలని” సునీల్ గవాస్కర్ సూచించాడు.
గ్రూప్-2లో పాకిస్తాన్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆప్ఘానిస్తాన్ ఉండగా.. మూడో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. నాలుగు, ఐదు స్థానాల్లో నమిబీయా, ఇండియా ఉంది. ఆదివారం కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పు ఇండియా సెమీస్‌కు వెళ్లే అవకాశం లేదు.
Reda Also.. T20 World Cup 2021: చెలరేగిన రిజ్వాన్, బాబర్.. సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పాకిస్తాన్..