AUS vs NZ Final: నేడే టీ20 ప్రపంచకప్ ఫైనల్.. తుది పోరులో తలపడనున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఎవరి బలం ఎంతంటే?

|

Nov 14, 2021 | 7:16 AM

టీ20 ప్రపంచకప్‌ విజేత ఎవరో ఇవాళ తేలిపోనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తుది పోరులో తలపడనున్నాయి. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది...

AUS vs NZ Final: నేడే టీ20 ప్రపంచకప్ ఫైనల్.. తుది పోరులో తలపడనున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఎవరి బలం ఎంతంటే?
Match
Follow us on

టీ20 ప్రపంచకప్‌ విజేత ఎవరో ఇవాళ తేలిపోనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తుది పోరులో తలపడనున్నాయి. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు గెలుపు కోసం ప్రణాళికలు రాచిస్తున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్‎ ఫైనల్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన కివీస్ ఈసారి టీ20 వరల్డ్ కప్ సాధించాలని పట్టుదలగా ఉంది. బౌలింగ్‌ విభాగంలో బలంగా ఉన్న న్యూజిలాండ్ ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో బ్యాటింగ్‌లోనూ సత్తాచాటింది. టిమ్‌ సోథి, ట్రెంట్‌ బౌల్ట్, ఆడమ్‌ మైనేలతో బలీయంగా ఉంది. లెగ్‌ స్మిన్నర్‌ ఐష్‌ సోథి బాగానే రాణిస్తున్నాడు. ఐసీసీ టోర్నీల్లో మెరుగ్గా ఆడుతున్నా.. తుదిపోరులో ఒత్తిడిని అధిగమించలేక తడబడడం కివీస్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

ఓపెనర్‌ మార్టిన్‌ గుప్తిల్‌కు.. ఆసీస్‌పై మంచి రికార్డు ఉంది. మరో ఓపెనర్ డేరిల్‌ మిచెల్‌ సెమీస్‎లో అద్భతంగా ఆడి జట్టును గెలిపించాడు. వీరిద్దరు బాగా ఆడితే కివీస్‎కు మంచి ఆరంభాన్ని లభిస్తుంది. కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ ఫామ్ లేమి ఆ జట్టును కలవర పరుస్తుంది. కీలకపోరులో అతడు పుంజుకుంటే కంగారులను దీటుగా ఎదుర్కొవచ్చని న్యూజిలాండ్ అంచనా వేస్తుంది. ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ ఫామ్‎తో కివీస్ హ్యాపీగా ఉంది. సెమీస్‌లో ఔటైన వెంటనే అసహనంతో బ్యాట్‌ను చేతికేసి కొట్టుకున్న డేవోన్‌ కాన్‌వే.. కుడి చేయి ఎముక విరిగింది. దీంతో అతండు జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో టిమ్ సీఫర్ట్ ఆడే అవకాశం ఉంది. కివీస్ ఇంతవరకు ఒక్క టీ20 వరల్డ్ కప్ గెలవలేదు.

ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే వరల్డ్ కప్‎లు గెలిచిన అనుభవం ఉంది. అయితే ఈ జట్టు ఇంత వరకు టీ20 వరల్డ్ కప్ గెలుచుకోలేదు. దీంతో టైటిల్ గెలవాలని ఆసీస్ భావిస్తోంది. కివీస్‌ను కట్టడి చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. సెమీస్‌లో పాకిస్తాన్‌పై అద్భుతంగా రాణించిన మార్కస్‌ స్టోయినిస్‌, మ్యాథ్యూ వేడ్‌ ఫైనల్‎లో తమ జోరు కొనసాగించాలని చూస్తున్నారు. బౌలింగ్‌ విభాగంలో ఆస్ట్రేలియా బలంగా ఉంది. మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, హేజిల్‌వుడ్‌లతో.. పేస్‌ దళం బలీయంగా ఉంది. లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా టోర్నీలో ఇప్పటివరకు 12 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ఫైనల్‌లో ఆఫ్‌ స్మిన్నర్‌ మ్యాక్స్‌వెల్‌ ఆ జట్టు విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫామ్‎లో ఉన్నాడు. గత మ్యాచ్‎లో వార్నర్ బాగానే ఆడాడు. కివీస్‌పై ఆస్ట్రేలియా కెప్టెన్, జట్టు ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌కు మంచి రికార్డు ఉంది. ఈ టోర్నీలో స్టీవ్‌ స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ పెద్దగా రాణించలేదు.

Read Also.. Rohit Sharma: హిట్‌మ్యాన్ అరుదైన రికార్డు.. వన్డేలో ఎవ్వరికి సాధ్యం కాలే.. ఇప్పటికీ చెక్కు చెదరలే.. అదేంటో తెలుసా?