టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. ఒమన్‌పై 26 పరుగుల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్ మొదటి మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా బ్యాటర్లు నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే తొలి ఐదు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన బంగ్లా జట్టు ఆ తర్వాత కాస్త కోలుకుంది. 10 ఓవర్ల వరకు మరో వికెట్ కోల్పోకుండా 38 పరుగులుచేసింది. 10 ఓవర్ల తర్వాత స్పీడ్ పెంచారు. 10కిపైగా సగటుతో పరుగులు పిండుకున్నారు. నయామ్ 50 బంతుల్లో(3 ఫోర్ల, 4సిక్సులు), షకీబుల్ హసన్ 29 బంతుల్లో 42(6 ఫోర్లు) బరుగులతో రాణించాడు. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో అలౌట్ అయి 153 పరుగులు చేసింది.
154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. మొదట బాగా ఆడినప్పటికీ చివర్లో ఒత్తిడితో వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లు ముస్తాఫిజుర్, షకీబ్ ధాటికి ఒమన్ 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. ఓ దశలో బంగ్లాదేశ్‌కు మరో ఓటమి ఖాయమయ్యేలా కనిపించినా, తేరుకున్న బంగ్లా బౌలర్లు చెలరేగిపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ 4 వికెట్లు, షకీబుల్ హసన్ 3, సైఫుద్దీన్, మెహిదీ హసన్ ఒక్కో వికెట్ తీశాడు. ఒమన్ ఆటగాడు జతిందర్ సింగ్(40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.