Sunil Gavaskar: న్యూజిలాండ్ సిరీస్‎కు వారిని ఎందుకు ఎంపిక చేయలేదు.. కారణం చెప్పాలి..

|

Nov 11, 2021 | 5:11 PM

న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు స్పిన్నర్లు రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిలను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని 16 మంది సభ్యుల జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) మంగళవారం ప్రకటించింది...

Sunil Gavaskar: న్యూజిలాండ్ సిరీస్‎కు వారిని ఎందుకు ఎంపిక చేయలేదు.. కారణం చెప్పాలి..
Gavaskar
Follow us on

న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు స్పిన్నర్లు రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిలను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని 16 మంది సభ్యుల జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) మంగళవారం ప్రకటించింది. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, షమీకి విశ్రాంతిని ఇచ్చింది. హార్దిక్ పాండ్యా, రాహుల్ చాహర్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తిని పక్కకు పెట్టారు.

టీ20 వరల్డ్ కప్‎లో నమీబియాతో జరిగిన మ్యాచ్‎లో రాహుల్ చాహర్ ఆడారు. నాలుగు ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చాడు. దీంతో కివీస్ సిరీస్‎కు అనుభవజ్ఞుడైన యుజ్వేంద్ర చాహల్‌ని జట్టులోకి తీసుకున్నారు. అయితే నవంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం BCCI భారత ‘A’ జట్టుకు రాహుల్ చాహర్‌ను ఎంపిక చేసింది. “వారు (యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్) తమ ఆటను నిరూపించుకున్నారు. వారికి ఉన్న అనుభవం కచ్చితంగా భారత జట్టును బలపరుస్తుంది’ అని గవాస్కర్ అన్నారు.

“కానీ రాహుల్ చాహర్ ఈ 16 మంది సభ్యుల జట్టులో లేకపోవడానికి అతను ఏమి చేశాడని ఆశ్చర్యపోతున్నాను. అతను టీ20 ప్రపంచ కప్ జట్టులో ఉండగలడు. అతను ఒక అవకాశం పొందాడు. అతను ఏమి తప్పు చేశాడని ఆలోచిస్తున్నాను. అతను జట్టులో ఎందుకు లేడని సెలక్షన్ కమిటీ నుండి ఎవరైనా అతనికి చెబుతారని నేను ఆశిస్తున్నాను ”అని చెప్పాడు. “వరుణ్ చకరవర్తికి కూడా ఎందుకు జట్టులోకి రాలేదో చెప్పాలి.” అని అన్నాడు.

న్యూజిలాండ్ టీ20 సిరీస్‎కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, అక్సర్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.

Read Also.. T20 World Cup 2021: న్యూజిలాండ్‎పై మాజీ క్రికెటర్ల ప్రశంసలు.. అద్భుతంగా ఆడారని సచిన్ కితాబు..