Biggest Run Chases: ఇంగ్లండ్‌పై శ్రీలంక చారిత్రక విజయం.. వన్డే క్రికెట్‌లో టాప్-5 భారీ రన్ ఛేజెస్ ఇవే

Biggest Run Chases: వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన జట్ల జాబితాలో దక్షిణాఫ్రికా, భారత్, శ్రీలంక సహా పలు జట్లు ఉన్నాయి. ఇంగ్లండ్‌పై 430 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక రెండో అత్యధిక రన్ ఛేజ్‌ను నమోదు చేసింది. 2006లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా సాధించిన 438 పరుగుల రికార్డు ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.

Biggest Run Chases: ఇంగ్లండ్‌పై శ్రీలంక చారిత్రక విజయం.. వన్డే క్రికెట్‌లో టాప్-5 భారీ రన్ ఛేజెస్ ఇవే
Odi Cricket

Updated on: Oct 23, 2026 | 9:01 AM

Biggest Run Chases: వన్డే క్రికెట్‌లో 400కు పైగా పరుగులు చేయడం అంటే మమూలు విషయం కాదు. అలాంటిది ప్రత్యర్థి జట్టు అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించి గెలిస్తే అది చరిత్రలో నిలిచిపోతుంది. అక్టోబర్ 22న రావల్పిండిలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే ట్రై సిరీస్ మ్యాచ్‌లో శ్రీలంక ఇదే చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 429 పరుగులు చేసింది. లక్ష్యం 430 పరుగులు కాగా, శ్రీలంక 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 430 పరుగులు సాధించింది. రెండు వికెట్ల తేడాతో గెలిచి వన్డేల్లో రెండో అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్‌ను నమోదు చేసింది.

అగ్రస్థానంలో సౌతాఫ్రికా

వన్డే క్రికెట్‌లో ఇప్పటికీ అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. 2006 మార్చి 12న జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 435 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 4 వికెట్లకు 434 పరుగులు చేసింది. సౌతాఫ్రికా 49.5 ఓవర్లలో 9 వికెట్లకు 438 పరుగులు చేసి ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. హెర్షెల్ గిబ్స్ అద్భుత శతకం ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించింది. రెండు దశాబ్దాలు గడిచినా ఈ రికార్డు ఇంకా పదిలంగానే ఉంది.

భారత్ కూడా భారీ ఛేజింగ్‌తో రికార్డు

ఈ జాబితాలో భారత్ కూడా రెండో స్థానంలో నిలిచింది. 2026 సెప్టెంబర్ 30న గౌహతిలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో భారత్ 406 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 405/7 స్కోరు సాధించింది. అనంతరం భారత్ కేవలం 43.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రోహిత్ శర్మ 101 పరుగులు చేయగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయంగా 223 పరుగులతో చెలరేగాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 255 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు.

నెదర్లాండ్స్‌ సంచలనం

2023 జూన్ 26న హరారేలో వెస్టిండీస్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన వన్డే కూడా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. తొలుత వెస్టిండీస్ 374/6 పరుగులు చేసింది. 375 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 50 ఓవర్లలో 374/9 స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. అందులో నెదర్లాండ్స్ అద్భుతంగా ఆడి విజయం సాధించింది. సాధారణ ఓవర్లలో మ్యాచ్ గెలవకపోయినా, సూపర్ ఓవర్‌లో విజయం సాధించడంతో ఈ ఛేజింగ్ వన్డే చరిత్రలో గుర్తుండిపోయింది.

మరోసారి సౌతాఫ్రికా మరోసారి

2016 అక్టోబర్ 5న డర్బన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో దక్షిణాఫ్రికా మరో భారీ ఛేజింగ్ నమోదు చేసింది. తొలుత ఆస్ట్రేలియా 371/6 పరుగులు చేసింది. 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 372 పరుగులు సాధించింది. డేవిడ్ మిల్లర్ అజేయంగా 118 పరుగులు చేయగా, క్వింటన్ డి కాక్ 70 పరుగులతో రాణించాడు. చివరి దశలో మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో కీలక భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో గెలిచి అప్పటి వరకు ఉన్న అత్యధిక రన్ ఛేజ్ రికార్డుల జాబితాలో మరో మైలురాయిని జోడించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us