SRH vs RR Eliminator: సన్‌రైజర్స్, రాజస్థాన్ పోరును డిసైడ్ చేసే నంబర్స్.. ఇది కదా అసలైన కిక్కిచ్చే గేమ్..!

Sunrisers Hyderabad vs Rajasthan Royals, Eliminator: సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుభవానికి, రాజస్థాన్ రాయల్స్ యువ రక్తం ఉత్సాహానికి మధ్య జరగబోయే ఈ పోరు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరి హైదరాబాద్ పరుగుల వీరులు పైచేయి సాధిస్తారా లేక రాజస్థాన్ కుర్రాడు సంచలనం సృష్టిస్తాడా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

SRH vs RR Eliminator: సన్‌రైజర్స్, రాజస్థాన్ పోరును డిసైడ్ చేసే నంబర్స్.. ఇది కదా అసలైన కిక్కిచ్చే గేమ్..!
Sunrisers Hyderabad Vs Rajasthan Royals, Eliminator

Updated on: May 27, 2026 | 1:47 PM

Sunrisers Hyderabad vs Rajasthan Royals, Eliminator: ఐపీఎల్ క్రికెట్ మహాసంగ్రామం క్లైమాక్స్ దశకు చేరుకుంది. నేడు జరగబోయే చావో రేవో ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లలోని విధ్వంసకర బ్యాటర్ల మధ్య జరగనున్న పరుగుల వేట ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది.

తగ్గేదేలే అంటున్న హైదరాబాద్ పరుగుల యంత్రాలు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది సరికొత్త దూకుడుతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు మిడిలార్డర్ నమ్మకమైన ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఏకంగా 606 పరుగులు సాధించి జట్టుకు వెన్నుముకగా నిలిచాడు. క్లాసెన్ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి కెప్టెన్లకు చెమటలు పట్టడం ఖాయం. మైదానం నలుమూలలా సిక్సర్లు బాదగల అతని నైపుణ్యం నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు అత్యంత కీలకం కానుంది.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ హిస్టరీలో 13 ఏళ్ల ఐరెన్ లెగ్ ప్లేయర్.. ఏ జట్టులో చేరినా ట్రోఫీకి దూరమవ్వాల్సిందే..?

ఇవి కూడా చదవండి

మరోవైపు ఓపెనింగ్ లో ఇషాన్ కిషన్ తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ సీజన్ లో 569 పరుగులు సాధించిన ఇషాన్, పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలింగ్ దాడిని చిన్నాభిన్నం చేయడానికి సిద్ధమయ్యాడు. అతనికి తోడుగా యువ సంచలనం అభిషేక్ శర్మ 563 పరుగులతో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అభిషేక్ క్రీజులోకి వస్తే బౌండరీల వర్షం కురవాల్సిందే. ఈ ముగ్గురు బ్యాటర్లు గనుక జోరు అందుకుంటే రాజస్థాన్ బౌలర్లకు గండం తప్పదని చెప్పవచ్చు.

రాజస్థాన్ ఆశలన్నీ ఆ పదిహేనేళ్ల కుర్రాడి పైనే!

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి క్వాలిఫైయర్ 2కు దూసుకెళ్లాలని పట్టుదలతో ఉంది. ఈ జట్టు తరపున అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక ఆటగాడు 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్ లో అత్యంత భయం లేని బ్యాటింగ్‌తో ప్రపంచ రికార్డులను సైతం బద్దలు కొట్టిన వైభవ్, ఏకంగా 583 పరుగులు సాధించాడు. అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ను అడ్డుకునేందుకు హైదరాబాద్ కెప్టెన్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: IPL 2026 Winner: ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే: రికీ పాంటింగ్

హైదరాబాద్ బౌలింగ్ విభాగం ఎంత బలంగా ఉన్నా, వైభవ్ సూర్యవంశీ గనుక ఒక్క ఐదు ఓవర్ల పాటు క్రీజులో నిలబడితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. టోర్నీలో ఇప్పటికే ఒక శతకంతో అదరగొట్టిన ఈ యువ కిరణం, నేటి చావో రేవో మ్యాచ్ లో రాజస్థాన్ జట్టుకు ప్రధాన ఆయుధంగా మారాడు.

గెలిస్తే ముందడుగు.. ఓడితే ఇంటికే!

ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా గుజరాత్ టైటాన్స్ తో తలపడేందుకు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు ప్రస్థానం ఈ సీజన్ లో అక్కడితో ముగుస్తుంది. పిచ్ పరిస్థితులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్ల మ్యాచ్ ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు క్లాసెన్, ఇషాన్, అభిషేక్ లతో కూడిన హైదరాబాద్ బ్యాటింగ్ దళం.. మరోవైపు ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగల రాజస్థాన్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య జరిగే ఈ పోరు అభిమానులకు అసలైన మజాను అందించనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us