Gautam Gambhir : నన్ను దేశద్రోహి, ఫిక్సర్ అని తిట్టాడు.. గంభీర్ అసలు స్వరూపాన్ని బయటపెట్టిన మాజీ క్రికెటర్

Gautam Gambhir : లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లో జరిగిన వాగ్వాదంపై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్ తనను ఫిక్సర్, దేశద్రోహి అంటూ దూషించాడని ఆరోపించడంతో పాటు రింగ్ ఫైట్‌కు కూడా సవాల్ విసిరాడు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Gautam Gambhir : నన్ను దేశద్రోహి,  ఫిక్సర్ అని తిట్టాడు.. గంభీర్ అసలు స్వరూపాన్ని బయటపెట్టిన మాజీ క్రికెటర్
Gambhir Sreesanth Fight

Updated on: Jun 20, 2026 | 10:27 AM

Gautam Gambhir : భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఎస్.శ్రీశాంత్ ల మధ్య మైదానంలో ఉన్న పాత శత్రుత్వం మరోసారి బహిర్గతమైంది. గతంలో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో గంభీర్ తనను ఫిక్సర్ అని అన్నాడంటూ శ్రీశాంత్ గతంలోనే ఆరోపించాడు. అయితే, తాజాగా శుక్రవారం ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఆ నాటి ఘటనకు సంబంధించి మరికొన్ని అత్యంత షాకింగ్ విషయాలను వెల్లడించాడు.

బౌన్సర్ వేయడమే గొడవకు కారణం

ప్రముఖ మీడియా సంస్థ లల్లన్‌టాప్ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. “గౌతీ చాలా మంచి క్రికెటర్, అతను క్రీజులోకి రాగానే నా బౌలింగ్‌ను అంచనా వేసి ఫ్లిక్ షాట్ ఆడాడు. అతను బాగా ఆడుతుండటంతో, నేను రిటైర్మెంట్ తర్వాత బౌన్సర్లు వేయకూడదనే నియమాన్ని పక్కనబెట్టి ఒక పవర్‌ఫుల్ బౌన్సర్ వేశాను. ఆ బంతిని గంభీర్ తల వంచి తృటిలో తప్పించుకున్నాడు. కానీ ఆ తర్వాతే అసలు గొడవ మొదలైంది. నేను బౌన్సర్ వేసినందుకు గంభీర్ తీవ్రమైన కోపంతో నా వైపు చూస్తూ వికృతంగా ప్రవర్తించాడు” అని శ్రీశాంత్ వివరించాడు.

దేశద్రోహి, ఫిక్సర్ అంటూ గంభీర్ దూషణలు

బౌన్సర్ వేసిన వెంటనే గంభీర్ నా దగ్గరకు వచ్చి I Own You (నువ్వు నా గుప్పిట్లో ఉన్నావు) అని గర్వంగా అన్నాడు. దానికి నేను స్పందిస్తూ.. “నువ్వు కాదు, నీ పార్టీ.. సారీ సారీ మన ఇద్దరి పార్టీ” అని బదులిచ్చాను. ఎందుకంటే మేమిద్దరం ఒకే రాజకీయ పార్టీ (BJP)లో ఉన్నాం. కానీ గంభీర్ అంతటితో ఆగకుండా నన్ను దారుణమైన బూతులు తిట్టడం ప్రారంభించాడు. నన్ను నేరుగా ఫిక్సర్ అని, దేశద్రోహి అని పిలిచాడు. నేను అతని దగ్గరకు వెళ్లి ‘గౌతీ భాయ్, అంతా ఓకేనా?’ అని అడిగినా అతను F అక్షరంతో కూడిన బూతు పదాలను వాడుతూ నన్ను అవమానించాడు అని శ్రీశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.

రింగ్ ఫైట్‌కు శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్

ఇంటర్వ్యూ ముగింపులో శ్రీశాంత్ తన పాత ప్రత్యర్థులకు ఒక క్రేజీ ఛాలెంజ్ విసిరాడు. గతంలో తనను మైదానంలో కొట్టిన హర్బజన్ సింగ్‌ను, ఇప్పుడు తనను దూషించిన గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. “భజ్జీకి దమ్ముంటే రమ్మను, గౌతీకి ధైర్యం ఉంటే రమ్మను.. మేమంతా ఒక బాక్సింగ్ రింగ్‌లోకి వెళ్లి తేల్చుకుందాం. కానీ నా ముందు గౌతమ్ గంభీర్ అస్సలు నిలబడలేడు. అతను క్రికెట్ కోచ్‌గా షార్ట్స్ వేసుకుని మైదానంలో ఉండటమే అతనికి మంచిది, నా ముందు ఫైటింగ్‌కు వస్తే తట్టుకోలేడు” అంటూ శ్రీశాంత్ సవాల్ విసిరాడు. కాగా, శ్రీశాంత్ చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us