
మెన్స్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ఎంతటి ఫాలోయింగ్, క్రేజ్ ఉందో, ఉమెన్స్ క్రికెట్‌లో స్మృతి మంధానకు అంత క్రేజ్ ఉంది. కోహ్లీని కింగ్ అంటే.. మంధానను క్వీన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని అంటూ ఉంటారు. చాలా స్ట్రైలిష్ బ్యాటింగ్ చేస్తూ.. కేవలం మెన్స్ క్రికెట్ మాత్రమే చూసే వారికి కూడా ఉమెన్స్ క్రికెట్ చూసేలా చేసిన క్రికెటర్ ఆమె. అలాంటి క్రికెటర్ కాబట్టే ఆమెకు కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. సాధారణంగా హీరోయిన్స్‌ను తమ క్రష్‌గా చెప్పుకునే అబ్బాయిలు.. తొలిసారి ఒక క్రికెటర్‌ను తమ క్రష్ అంటూ చెప్పుకున్నారు.. ఆమె మరెవరో కాదు స్మృతి మంధాననే. అంతటి క్రేజ్ ఉన్న క్రికెటర్.. బ్యాటింగ్‌లో అదరగొట్టడమే కదా, ఆఫ్ ది ఫీల్డ్‌లో కూడా క్వీన్‌లా ఉంటుంది. తాజాగా తెలుగులో మాట్లాడి అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది.
ప్రస్తుతం ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఇంగ్లాండ్‌తో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా ఆ మ్యాచ్ ఈ నెల 10న ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు తొలి టెస్టు ఆడుతున్న మన తెలుగమ్మాయి శ్రీచరణికి టీమ్ హడిల్‌లో టెస్ట్ క్యాప్ అందజేసింది మంధాన. ఈ సందర్భంగా తన కెరీర్‌లో మంచిగా రాణించాలని, రిటైర్ అయ్యేనాటికి ఒక బెస్ట్ స్పిన్నర్‌గా ఉండాలని కోరుకుంటూ తెలుగులో కూడా మాట్లాడింది. ఒక చీటిపై రాసుకున్న తెలుగు పదాలను ముద్దు ముద్దుగా పలుకుతూ చెప్పింది. ఇంతకీ మంధాన ఏం చెప్పిందంటూ.. ‘నువ్వే అందరికన్న బెస్ట్’ అంటూ శ్రీచరణిని తెలుగులో ప్రశంసించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Smriti to Sree, “Nuvve Andarikanna Best” 🤩pic.twitter.com/VuHAEdSYdU
— CricketGully (@thecricketgully) July 11, 2026
కాగా యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణీ ఇంగ్లండ్‌తో లార్డ్స్ క్రికెట మైదానంలో జరిగిన మహిళల టెస్టు మ్యాచ్ ద్వారా టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. క్రికెట్‌కు పుట్టినిల్లుగా పేరొందిన లార్డ్స్‌లో తొలి టెస్టు క్యాప్ అందుకోవడం ద్వారా ఆమె తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకుంది. టీ20 ఫార్మాట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో గుర్తింపు పొందిన శ్రీ చరణీ ఇటీవల జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి, మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా కొత్త రికార్డు నెలకొల్పింది. అంతకుముందు 2020 ప్రపంచకప్‌లో పూనమ్ యాదవ్ పేరిట ఉన్న 10 వికెట్ల రికార్డును ఆమె అధిగమించింది. అంతేకాకుండా, ఒకే మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ అమేలియా కెర్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో ఆమె ఐసీసీ మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కూడా అగ్రస్థానానికి చేరుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి