IPL 2027: శుభ్మన్ గిల్ మాస్టర్ ప్లాన్.. రూ.3.8 కోట్ల పవర్ హిట్టర్‌పై కన్నేశాడుగా..!

Ashutosh Sharma Trade News: ఐపీఎల్ 2027 వేలానికి ముందే ఆటగాళ్ల ట్రేడింగ్ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. హార్దిక్ పాండ్యా ట్రేడ్ వార్తల మధ్య గుజరాత్ టైటాన్స్ మరో కీలక ఆటగాడిపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన భారత పవర్ హిట్టర్ ఆశుతోష్ శర్మను జట్టులోకి తీసుకోవాలని శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

IPL 2027: శుభ్మన్ గిల్ మాస్టర్ ప్లాన్.. రూ.3.8 కోట్ల పవర్ హిట్టర్‌పై కన్నేశాడుగా..!
Ipl 2027 Gt Auction

Updated on: Nov 09, 2026 | 12:45 PM

Gujarat Titans IPL 2027: ఐపీఎల్ (IPL) 2027 సీజన్‌కు ముందే ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ వ్యవహారాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ ఆటగాళ్లు జట్లు మారనున్నారనే వార్తలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి పెంచుతున్నాయి. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మరో కీలక ట్రేడ్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టులో ఉన్న భారత పవర్ హిట్టర్ ఆశుతోష్ శర్మ (Ashutosh Sharma)ను తమ జట్టులోకి తీసుకోవాలని గుజరాత్ భావిస్తున్నట్లు క్రిక్‌బజ్ (Cricbuzz) కథనం వెల్లడించింది.

రూ.3.8 కోట్ల ఆటగాడిపై గుజరాత్ కన్ను..!

28 ఏళ్ల ఆశుతోష్ శర్మ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 168.86 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించగల సామర్థ్యం అతడి ప్రత్యేకత. 2025 ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.3.8 కోట్లకు కొనుగోలు చేసింది. కొన్ని నెలల క్రితమే ఆశుతోష్ ట్రేడ్ గురించి గుజరాత్ ఫ్రాంచైజీ ఢిల్లీ యాజమాన్యాన్ని సంప్రదించినట్లు సమాచారం. అయితే అప్పట్లో ఢిల్లీ నుంచి తక్షణ స్పందన రాలేదని తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినది: SRH Retention List: కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?

ఇవి కూడా చదవండి

లక్నో కూడా రేసులో ఉందా..?

ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త సహాయక సిబ్బంది బాధ్యతలు చేపట్టడం, మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) నేతృత్వంలో కొత్త ప్రణాళికలు రూపొందుతున్న నేపథ్యంలో ఆశుతోష్ ట్రేడ్ అంశాన్ని మరోసారి పరిశీలించే అవకాశం ఉందని కథనం పేర్కొంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కూడా ఈ భారత బ్యాటర్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీకి ప్రతిఫలంగా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అదనపు ఆటగాళ్లను అందించగల జట్లు ఈ ట్రేడ్‌లో ముందుండవచ్చని తెలుస్తోంది.

154.2 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన ఆటగాడితో ట్రేడ్..?

గుజరాత్ టైటాన్స్ మరో ఫినిషర్ కోసం వేరే ఫ్రాంచైజీని కూడా సంప్రదించినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఒప్పందంలో 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ (Ashok Sharma)ను ఇచ్చేందుకు గుజరాత్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ 2026లో గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి ఆ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని నమోదు చేశాడు. అయితే టోర్నీ రెండో భాగంలో జట్టులో చోటు కోల్పోయాడు.

ఎక్కువమంది చదివినది: 109 పరుగులే టార్గెట్.. 7 వికెట్లు పడినా భారత్ ఎలా గెలిచింది.. డీఎల్‌ఎస్ మెథడ్ పూర్తి లెక్క ఇదే..!

గుజరాత్‌కు ఫినిషర్ అవసరం ఎందుకు..?

గుజరాత్ జట్టులో శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ (Sai Sudharsan), జోస్ బట్లర్ (Jos Buttler) టాప్ ఆర్డర్‌లో నిలకడగా రాణిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు విఫలమైన రోజుల్లో జట్టును ఆదుకునే ఫినిషర్ అవసరం కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ (Shahrukh Khan), రాహుల్ తెవాటియా (Rahul Tewatia) నుంచి ఆశించిన స్థాయిలో స్థిరమైన ప్రదర్శనలు రాకపోవడంతో ఆశుతోష్ శర్మను తీసుకోవాలని గుజరాత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఐపీఎల్ 2027కు ముందే గుజరాత్ టైటాన్స్ తమ బ్యాటింగ్ బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఆశుతోష్ శర్మ ట్రేడ్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us