మావాడే దగ్గరుండి మరీ ఓడించాడు.. నా పవర్ ఏంటో ఫైనల్లో చూపిస్తా..: శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్

Shubman Gill Comments on Gujarat Titans Defeat: తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్ చేరడానికి ఇంకా ఒక అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో జరిగే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్ తలపడనుంది. కనీసం ఆ మ్యాచ్‌కైనా తమ ఫీల్డింగ్ లోపాలను సవరించుకుని, పటిష్టమైన వ్యూహంతో బరిలోకి దిగితేనే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ రేసులో నిలవగలదు.

మావాడే దగ్గరుండి మరీ ఓడించాడు.. నా పవర్ ఏంటో ఫైనల్లో చూపిస్తా..: శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్
Shubman Gill Comments On Gt Defeat

Updated on: May 27, 2026 | 12:51 PM

Shubman Gill Comments on Gujarat Titans Defeat: ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లను చేజేతులా వదిలేసి, ఫీల్డింగ్‌లో ఘోర తప్పిదాలు చేయడం వల్లనే తాము గెలవాల్సిన మ్యాచ్‌ను ఆర్సీబీకి సమర్పించుకున్నామని గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

చేజేతులా మ్యాచ్ వదిలేసిన గుజరాత్ టైటాన్స్..

ధర్మశాల మైదానంలో టాస్ గెలిచి అన్నీ అనుకూలంగా ఉన్న వేళ, గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు మైదానంలో చేసిన చెత్త ఫీల్డింగ్ వారి కొంపముంచింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫీల్డర్లు ఏకంగా మూడు కీలకమైన క్యాచ్‌లను చేజార్చారు. రనౌట్ చేసే సువర్ణ అవకాశాలను కూడా వృధా చేసుకున్నారు. అప్పటివరకు మ్యాచ్‌పై పట్టు సాధించినట్లు కనిపించిన గుజరాత్, ఫీల్డింగ్ వైఫల్యాల కారణంగా ఆర్సీబీకి భారీ స్కోరు చేసే అవకాశాన్ని కల్పించింది.

మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన రజత్ పాటిదార్ క్యాచ్ డ్రాప్..!

ఈ మ్యాచ్‌లోనే అత్యంత ఖరీదైన తప్పిదం 14వ ఓవర్లో జరిగింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బౌలింగ్‌లో ఆర్సీబీ బ్యాటర్ రజత్ పాటిదార్ గాల్లోకి లేపిన బంతిని కగిసో రబాడ సులువుగా అందుకోవాల్సింది. కానీ, అందరూ అవుట్ అనుకున్న తరుణంలో రబాడ ఆ క్యాచ్‌ను వదిలేశాడు. క్యాచ్ వదిలేసే సమయానికి పాటిదార్ కేవలం 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆ సమయానికి ఆర్సీబీ స్కోరు 14 ఓవర్లలో 140 పరుగులు మాత్రమే.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత రజత్ పాటిదార్ చెలరేగిపోయాడు. గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు బాదాడు. దీంతో ఆర్సీబీ ఆఖరి 6 ఓవర్లలో ఏకంగా 114 పరుగులు రాబట్టి, నిర్ణీత ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది.

కొండంత లక్ష్యం.. కుప్పకూలిన బ్యాటింగ్ లైన్ అప్..

256 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే ఒత్తిడికి లోనైంది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా పవర్ ప్లేలో ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ ‘హిట్ వికెట్’ రూపంలో దురదృష్టవశాత్తూ అవుట్ కావడం జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. చివరికి గుజరాత్ జట్టు కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

తప్పులు ఒప్పుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

మ్యాచ్ ముగిసిన అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తమ ఓటమిపై స్పందించాడు. “మొదటి 12 నుంచి 13 ఓవర్ల వరకు మ్యాచ్‌పై మాకు పూర్తి నియంత్రణ ఉంది. బౌలర్లు బాగానే రాణించారు. కానీ మైదానంలో చేసిన తప్పులు, ముఖ్యంగా రజత్ పాటిదార్ క్యాచ్ వదిలేయడం మాకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆ ఒక్క క్యాచ్ డ్రాప్‌తో మ్యాచ్ మా చేతుల్లోంచి పూర్తిగా జారిపోయింది. ఆ తర్వాతి ఓవర్లలో మేము భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. అలాగే బ్యాటింగ్‌లో కూడా మాకు సరైన ఆరంభం దక్కలేదు. సాయి సుదర్శన్ అలా అవుట్ అవ్వడం నిజంగా దురదృష్టకరం” అని గిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us