IND vs AUS: సింగిల్‌గా వస్తా.. చెడుగుడు ఆడేస్తా..: సెమీస్‌కు ముందే ఆసీస్‌కు ఇచ్చిపడేసిన లేడీ సెహ్వాగ్

INDW vs AUSW: దేశవాళీ టీ20 లీగ్‌లో అత్యధిక పరుగులు (341) చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షఫాలీ వర్మ రాకతో, స్మృతి మంధాన, షఫాలీ రూపంలో భారత్‌కు మళ్లీ విధ్వంసకర ఓపెనింగ్ జోడీ లభించినట్టయింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై నాకౌట్ మ్యాచ్‌లో ఈ దూకుడు ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి. అక్టోబర్ 30న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.

IND vs AUS: సింగిల్‌గా వస్తా.. చెడుగుడు ఆడేస్తా..: సెమీస్‌కు ముందే ఆసీస్‌కు ఇచ్చిపడేసిన లేడీ సెహ్వాగ్
Shafali Verma

Updated on: Oct 29, 2025 | 7:57 PM

INDW vs AUSW: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ (ICC Women’s ODI World Cup) 2025లో భారత్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌లో తలపడనుంది. ఈ కీలక నాకౌట్ మ్యాచ్‌కి సరిగ్గా ముందు, గాయపడిన ఓపెనర్ ప్రతీక రావల్ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Verma) తన ఆట పట్ల పూర్తి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు జట్టులోకి పిలుపు అందుకున్నా, తాను ఒత్తిడికిలోను కాకుండా సాధారణంగా ఆడడానికే ప్రయత్నిస్తానని, జట్టు కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తానని ఆమె స్పష్టం చేశారు.

సెమీఫైనల్‌కు ముందు షఫాలీ వర్మ సందేశం..

బీసీసీఐ (BCCI) ద్వారా విడుదలైన ఒక వీడియోలో, 21 ఏళ్ల ఈ డాషింగ్ బ్యాటర్ సెమీఫైనల్‌కు ముందు తన ఆలోచనలను పంచుకున్నారు.

“టోర్నమెంట్ చివరిలో, అదీ నేరుగా సెమీఫైనల్ వంటి కీలకమైన మ్యాచ్‌కు జట్టులోకి రావడం నిజంగా ఒక సవాలే. కానీ, ఇలాంటి కీలక సందర్భంలో ఆడడం నాకెంతో ప్రేరణనిస్తుంది. సొంత గడ్డపై, అభిమానుల మధ్య ప్రపంచ కప్ ఆడడం ఒక భిన్నమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. స్టేడియం నిండిపోయి, ప్రేక్షకుల చప్పట్లు వింటుంటే, ఒక స్పోర్ట్స్‌పర్సన్‌గా మన కాళ్లు ఆటోమేటిక్‌గా కదులుతాయి. ప్రేరణ వంద శాతం ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

“నా ఆటను ఎంత సింపుల్‌గా ఉంచుకుంటే, అంత బాగా ప్రదర్శిస్తాను. అందుకే, ‘శాంతంగా ఉండు’, ‘నిన్ను నువ్వు నమ్ము’ వంటి చిన్న చిన్న విషయాలను నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను. ఇవి నాకు సహాయపడతాయని ఆశిస్తున్నాను” అంటూ తెలిపింది.

“దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు కాబట్టి, నాకు అవకాశం వస్తే, ఉత్తమ ఉద్దేశంతో నా బెస్ట్ గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తా. జట్టుకు ఏం అవసరమో అదే చేస్తాను. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, అంతే” అంటూ చెప్పుకొచ్చింది.

రావల్ స్థానంలో షఫాలీ వర్మకు అవకాశం..

భారత ఓపెనింగ్‌కు టోర్నమెంట్‌లో నిలకడగా పరుగులు అందించిన ప్రతీక రావల్ బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ మోకాలి, చీలమండ గాయాల కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో షఫాలీ వర్మకు అనూహ్యంగా సెమీఫైనల్ బెర్త్ దక్కింది.

దేశవాళీ టీ20 లీగ్‌లో అత్యధిక పరుగులు (341) చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షఫాలీ వర్మ రాకతో, స్మృతి మంధాన, షఫాలీ రూపంలో భారత్‌కు మళ్లీ విధ్వంసకర ఓపెనింగ్ జోడీ లభించినట్టయింది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై నాకౌట్ మ్యాచ్‌లో ఈ దూకుడు ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి. అక్టోబర్ 30న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..