బెంగళూరు: దులీప్ ట్రోఫీ 2024లో తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలం చెందిన సర్ఫరాజ్ ఖాన్ రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టాడు. ఒక ఓవర్లో వరుసగా ఐదు బౌండరీలతో రాణించాడు. చిన్నస్వామి స్టేడియంలో ఇండియా Aతో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా B ఆధిక్యంలో నిలిచింది. 134/2 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద శనివారంనాడు మూడో రోజు ఆటను కొనసాగించిన ఇండియా A 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో కేఎల్ రాహుల్ (37) మాత్రమే గౌరవ ప్రదమైన స్కోరు సాధించాడు. ఇండియా B బౌలర్లు ముకేశ్ కుమార్, నవదీప్ సైని తలా మూడు వికెట్లు సాధించగా.. సాయి కిశోర్ రెండు వికెట్స్‌తో ఇండియా A బ్యాట్స్‌మన్లను నిలువరించారు.
తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులతో రాణించిన ఇండియా B ఆటగాడు ముషీర్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ ఆకాశ్ దీప్ వేసిన ఒక ఓవర్లో ఐదు బౌండరీలు బాదాడు. 36 బంతుల్లో 7 బౌండరీలు, 1 సిక్స్‌తో 46 పరుగులు సాధించాడు సర్ఫరాజ్ ఖాన్. అటు రిషభ్ పంత్ 47 బంతుల్లో 61 పరుగులతో రాణించాడు. కేవలం 34 బంతుల్లోనే పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్, రిషభ్ పంత్ కలిసి ఇన్నింగ్స్‌ను గాటిలో పెట్టడంతో ఇండియా B మ్యాచ్‌పై పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా B ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించి మొత్తంగా 240 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఒక ఓవర్లో 5 బౌండరీలు బాదిన సర్ఫరాజ్ ఖాన్..వీడియో చూడండి
4⃣4⃣4⃣4⃣4⃣
Sarfaraz Khan on 🔥
He hits five fours in an over, off Akash Deep!
What delightful strokes 👌#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/AWE5JhJiuS
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2024
తొలి ఇన్నింగ్స్
ఇండియా B: 321
ఇండియా A: 231
రెండో ఇన్సింగ్న్
ఇండియా B: 150/6 (ముగిసిన మూడో రోజు ఆట)
(ఇండియా B ఆధిక్యం 240 పరుగులు)