Rishabh Pant: ఇదేందయ్యా ఇది.. ఒక్క నిర్ణయంతో రూ. 15 కోట్లు నష్టపోయిన రిషభ్ పంత్..!

Rishabh Pant IPL 2027 Salary: రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఆ జట్టు అభిమానులకు అతనొక ఎమోషన్. జీతం తగ్గినా సరే, మళ్లీ తన సొంత జట్టు తరఫున మైదానంలోకి దిగి ఢిల్లీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించడమే లక్ష్యంగా పంత్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ ట్రేడింగ్ అధికారికంగా ఖరారైతే వచ్చే సీజన్‌లో అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.

Rishabh Pant: ఇదేందయ్యా ఇది.. ఒక్క నిర్ణయంతో రూ. 15 కోట్లు నష్టపోయిన రిషభ్ పంత్..!
Rishabh Pant Ipl 2027 Salary

Updated on: Jun 20, 2026 | 6:54 PM

Rishabh Pant IPL 2027 Salary: ఐపీఎల్ 2027 సీజన్‌కు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ, క్రికెట్ ప్రపంచంలో అప్పుడే బదిలీల (ట్రేడింగ్) వేడి మొదలైంది. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున రికార్డు ధర పలికిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, మళ్లీ తన పాత గూడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి రాబోతున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పాత గూటికి పంత్ పయనం.. కారణం ఇదే..!

రిషభ్ పంత్ కెరీర్ ఢిల్లీ ఫ్రాంచైజీతోనే మొదలైంది. 2016లో అరంగేట్రం చేసిన పంత్, అతి తక్కువ కాలంలోనే ఆ జట్టుకు వెన్నెముకగా మారాడు. శ్రేయస్ అయ్యర్ గాయపడిన సమయంలో జట్టు పగ్గాలు అందుకున్న పంత్, ఆ తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్‌గా నాలుగు సీజన్ల పాటు జట్టును నడిపించాడు. అయితే, 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ యాజమాన్యాన్ని నిర్వహిస్తున్న జీఎమ్ఆర్ (GMR) గ్రూప్‌తో వచ్చిన విభేదాల కారణంగా పంత్ ఆ జట్టును వీడాల్సి వచ్చింది.

ఆ తర్వాత జరిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 27 కోట్ల రూపాయల రికార్డు ధరతో అతన్ని సొంతం చేసుకుని ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిపింది. అయితే, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్వహణ బాధ్యతలు జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్ చేతికి రావడం, ఆ గ్రూప్ డైరెక్టర్ పార్థ్ జిందాల్‌కు పంత్ అంటే ఎంతో ఇష్టం ఉండటంతో అతన్ని తిరిగి జట్టులోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తగ్గనున్న పంత్ రెమ్యునరేషన్.. ఆ రూ. 27 కోట్లు రానట్టేనా?

లక్నో జట్టులో 27 కోట్ల రూపాయల భారీ జీతం అందుకుంటున్న పంత్‌కు, ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి వస్తే అంత మొత్తం దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ట్రేడింగ్ ద్వారా ఢిల్లీ జట్టులోకి వస్తే పంత్ వేతనం దాదాపు 15 కోట్ల రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే, పంత్ డబ్బు కంటే తన పాత బంధానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని, అందుకే జీతం విషయంలో పెద్దగా పట్టుబట్టకుండా నిర్ణయాన్ని లక్నో, ఢిల్లీ యాజమాన్యాలకే వదిలేశాడని సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us