RCB vs LSG: బుల్లెట్ వేగం ఓవైపు.. మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ మరోవైపు.. బెంగళూరులో ఆసక్తిరేపుతోన్న ఆ ఇద్దరి పోరు

|

Apr 02, 2024 | 2:29 PM

Bengaluru Weather Report, RCB vs LSG: తన ఐపీఎల్ అరంగేట్రంలో 155.8 కిమీ వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్, ఇన్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ నేడు ఒకరినొకరు ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి మధ్య పోరు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందా, మంచు ప్రభావం ఎలా ఉందో ఓసారి చూద్దాం..

RCB vs LSG: బుల్లెట్ వేగం ఓవైపు.. మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ మరోవైపు.. బెంగళూరులో ఆసక్తిరేపుతోన్న ఆ ఇద్దరి పోరు
Follow us on

Mayank Yadav vs Virat Kohli, RCB vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 15వ మ్యాచ్ ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (RCB vs LSG) మధ్య జరగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో లక్నో RCBతో తలపడుతుండగా, అందరి దృష్టి ఢిల్లీ యువ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్‌పై ఉంది. గత మ్యాచ్‌లో మయాంక్ ఐపీఎల్ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరి సంచలనం సృష్టించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ అరంగేట్రంలో మయాంక్ గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు.

ఈసారి మయాంక్‌ను ‘విరాట్’ ఎదుర్కోనున్నాడు. ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీతో తలపడేందుకు ఈ యువ బౌలర్ ఎదురుచూస్తున్నాడు. ఇలా మయాంక్-కోహ్లీ మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. మరి కీలక మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్స్ ఎలా రాణిస్తారో చూడాలి. సొంతమైదానంలో గత మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

RCB ఇప్పటి వరకు తమ ప్రదర్శనల్లో నిలకడగా లేదు. మూడు మ్యాచ్‌ల్లో రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి వారి నెట్ రన్ రేట్ కూడా అధ్వాన్నంగా మారింది. ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని RCB జట్టును విస్మరించలేం. కానీ, ఆటగాళ్లు వారి ప్రదర్శనలో స్థిరంగా ఉండాలి. వారికి చాలా మంది స్టార్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. కానీ, విరాట్ తప్ప మరెవరూ రాణించలేకపోయారు.

ఇవి కూడా చదవండి

మ్యాచ్‌కి వర్షం ఆటంకం?

ఆర్‌సీబీ, లక్నో సూపర్‌జెయింట్‌ల మధ్య మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం తక్కువ. అయితే, ఇది రాత్రి ఆట కావడంతో మంచు కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య వాతావరణం బ్యాటింగ్ జట్టుకు అనుకూలంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ మంచు ఉండదు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి రాత్రి 7 గంటల నుంచి 33 డిగ్రీల సెల్సియస్, రాత్రి 11 గంటలకు 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

ప్లేయింగ్ XIలో మార్పులు..

ఆర్సీబీ ఆందోళన కేవలం బ్యాటింగ్‌పైనే కాదు.. కీలక బౌలర్లు కూడా ఇంతవరకు రాణించలేకపోయారు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్‌పై ఫాస్ట్ బౌలింగ్ విభాగం ఆధారపడి ఉంది. అంతేకాదు పరుగులను నియంత్రించడంలో కూడా విఫలమయ్యాడు. సిరాజ్‌తో పాటు అల్జారీ జోసెఫ్ కూడా ఓవర్‌కు 9.4 పరుగుల చొప్పున ఇప్పటి వరకు కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఈ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్‌కు బదులుగా రీస్ టోప్లీ లేదా లాకీ ఫెర్గూసన్ ఈరోజు ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..